ఐస్‌ల్యాండ్‌లో మరోసారి అగ్నిపర్వతం బద్దలైంది. దక్షిణ ఐస్‌ల్యాండ్‌లోని రెక్జానెస్ ద్వీపకల్పంలో స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11.14 గంటలకు విస్ఫోటం సంభవించిందని సమాచారం. అగ్నిపర్వతం నుంచి భారీగా ఉబికి వస్తోన్న లావా ఓ చిన్నపాటి నదిలా ప్రవహిస్తోంది. ఇదంతా బ్లూ లగూన్ స్పా వైపుగా పారుతూ వెళ్తోంది. ఎరుపురంగులో ప్రత్యేక ఆకర్షణగా ప్రవహిస్తున్న లావా ప్రకృతి రమణీయతకు అద్దం పడుతున్నట్టుగా కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఐస్‌లాండ్‌కు పోటెత్తుతున్నారు.
అగ్నిపర్వత విస్పోటనంతో సుమారు మూడు కిలోమీటర్ల మేర చీలికలు ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు. అయితే గత ఆగస్ట్ లో సంభవించిన విస్ఫోటంతో పోలిస్తే ఇది చిన్నదేనని స్పష్టం చేశారు. విస్ఫోటంతో గ్రిండావిక్ సహా సమీప పట్టణాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఐస్‌లాండ్‌లోని రేక్‌జానెస్ ద్వీపకల్పంలో ఉన్న అగ్నిపర్వతం మీదుగా తమ విమానం వెళ్తుతుండగా ప్రయాణికులు లావా గడ్డలు, పొగను తమ కెమెరాల్లో బంధించారు. ఏడాదిలోపుగాఏ ఏడోసారి ఇక్కడ జరిగిన విస్పోటనంతో దిగువన ఉన్న ఐస్‌లాండ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బ్లూ లగూన్ హోటల్ కార్ పార్కింగ్ లావాతో మునిగిపోయింది. హెటల్‌లోని అతిథులను సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించారు. అయితే, ఈ ప్రాంతంలో విమాన ప్రయాణానికి ఎటువంటి ముప్పు లేదని అధికారులు తెలిపారు.
వీడియో ఇక్కడ చూడండి..
My life has peaked. Nothing is ever topping this. Volcano erupted last night in Iceland 🇮🇸 pic.twitter.com/x2sqlJTwym
— kayleigh🫧⚒️ (@PatterKayleigh) November 21, 2024
రేక్జాన్స్ ద్వీపకల్పంలో ఈ అగ్నిపర్వతం దాదాపు 8వందల ఏళ్లుగా ఈ వొల్కనో విస్పోటనం చెందకుండా నిశ్శబ్దంగా ఉంది. గతేడాది డిసెంబర్‌లో తొలిసారి బద్ధలైన అగ్నిపర్వతం.. ఇప్పటివరకు 7సార్లు విస్ఫోటనం చెందినట్టుగా అధికారులు వెల్లడించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..