మాస్టారు గొప్ప మనసు..! పనివారికి డబుల్ బెడ్‌రూం ఇండ్లు.. ఒక్కోటి రూ.80 లక్షలు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మన చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచుకుంటేనే మనం సంతోషంగా ఉండగలం. దాని ఆధారంగా, తాను నలుగురికి ఇళ్ళు నిర్మించాను. మనల్ని బాగా చూసుకునేవారిని మనమూ బాగా చూసుకోవాలి కదా అని అంటారు బాలగురుసామి. కాగా, వైస్ ఛాన్సలర్ తీసుకున్న ఈ చర్య ఆ ఉద్యోగుల జీవితాల్లో కొత్త సంతోషాన్ని నింపింది. వారంతా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుని తమ యజమానికి కృతజ్ఞతలు తెలిపారు.

మాస్టారు గొప్ప మనసు..! పనివారికి డబుల్ బెడ్‌రూం ఇండ్లు.. ఒక్కోటి రూ.80 లక్షలు
Anna University Vc's Genero

Updated on: Sep 06, 2025 | 1:02 PM

చాలా మంది తమ ఉద్యోగులు, ఇంట్లో పనివాళ్లను కనీసం మనుషులుగా కూడా చూడరు. పనివాళ్లంటే కేవలం మన వద్ద పనిచేసేవాళ్లుగా భావిస్తారు. వాళ్ల నుండి శ్రమను మాత్రమే తీసుకోవాలనుకునే యజమానుల మధ్య ఒక వ్యక్తి ఎవరూ చేయని గొప్పపనిచేశారు. తన ఇంట్లో పనిచేసేవారిని అతడు తన కుటుంబ సభ్యుల్లా భావించాడు.. అందుకే పేద మధ్యతరగతి ప్రజల కలగా భావించే సొంత ఇల్లు అనే కలను సాకారం చేసి చూపించారు. అవును, మీరు విన్నది నిజమే… చెన్నైలోని అన్నా విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి బాలగురుసామి తన వద్ద పనిచేస్తున్న వారిని తమ ఫ్యామిలీ మెంబర్లుగా భావిస్తారు. వారి కష్టసుఖాలను ఆరా తీస్తూ తగిన సాయం చేస్తుంటారు.

తాజాగా బాలగురుసామి కోయంబత్తూరులోని తన ఇంట్లో పనిచేస్తున్న భువనేశ్వరన్, భాగ్య, కృష్ణవేణి, ప్రభావతిలకు వేర్వేరుగా ఇళ్లు నిర్మించి ఇచ్చారు. ఒక్కొక్కటి మూడు సెంట్లలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించి ఇచ్చారు. ఈ ఇళ్లకు రూ.80 లక్షల చొప్పున ఖర్చయిందని తెలిసింది.. బాలగురుసామి ఉపకులపతిగా పనిచేయక ముందు బెంగళూరులో నివాసం ఉన్నారు. అక్కడా ఇలానే ఇద్దరికి ఇళ్లు నిర్మించి ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా బాలగురుసామి మాట్లాడుతూ…మన చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచుకుంటేనే మనం సంతోషంగా ఉండగలం. దాని ఆధారంగా, తాను నలుగురికి ఇళ్ళు నిర్మించాను. మనల్ని బాగా చూసుకునేవారిని మనమూ బాగా చూసుకోవాలి కదా అని అంటారు బాలగురుసామి. కాగా, వైస్ ఛాన్సలర్ తీసుకున్న ఈ చర్య ఆ ఉద్యోగుల జీవితాల్లో కొత్త సంతోషాన్ని నింపింది. వారంతా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుని తమ యజమానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..