Viral Video: మాటేసిన కుక్కను ఏకిపారేసిన మేక.. వెంటపడి మరి ఓ ఆటాడుకుందిగా.. వీడియో వైరల్

|

Dec 07, 2021 | 1:40 PM

Angry Goat thrashed Dog Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ కొన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని నవ్వులు పూయిస్తుంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అయితే..

Viral Video: మాటేసిన కుక్కను ఏకిపారేసిన మేక.. వెంటపడి మరి ఓ ఆటాడుకుందిగా.. వీడియో వైరల్
Goat Attack Dog
Follow us on

Angry Goat thrashed Dog Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ కొన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని నవ్వులు పూయిస్తుంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అయితే.. వైరల్ అవుతున్న వీడియోల్లో జంతువులకు సంబంధించినవే ఎక్కువగా ఉంటాయి. సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న వీడియోలలో పాములు, కుక్కలు, పిల్లులు, కోతులు, తదితర జంతువులకు సంబంధించినవి ఉన్నాయి. ప్రజలు కూడా అలాంటివాటినే తెగ ఇష్టపడతారు. దీంతోపాటు పలు రకాల ఫన్నీ కామెంట్లు చేస్తుంటారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియో.. మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించడం గ్యారెంటీ. వైరల్ అవుతున్న వీడియోలో రెండు మేకలు, కుక్క కనిపిస్తుంటాయి. అయితే.. అక్కడ ఏం జరుగుతుందోనని అందరూ ఉత్కంఠగా చూస్తుంటారు. మేకలను వేటాడేందుకే కుక్క అక్కడికి వచ్చిందేమో అనిపిస్తుంది. కానీ అక్కడ జరిగిన విషయం మాత్రం వేరు. మేక దాడితో కుక్క కెవ్వుమంటూ పరుగులు పెడుతుంది.

వైరల్ వీడియోలో ఒక ఇంటి వెలుపల వరండాలో రెండు మేకలు నిలబడి ఉన్నాయి. పక్కనే ఉన్న టేబుల్ కింద ఒక కుక్క దాక్కుంది. ఈ దాగి ఉన్న కుక్క మేకకు కనిపిస్తుంది. దీంతో అది దాని బారి నుంచి బయటపడుదామని మేక కొంచెం ముందుకొస్తుంది. ఆపై కోపంతో నేరుగా టేబుల్ వద్దకు దూసుకెళ్లి.. టేబుల్ కింద దాక్కున్న కుక్కపై దాడి చేయడం ప్రారంభిస్తుంది. మేక తన కొమ్ములతో ఆకస్మిక దాడి చేయడంతో కుక్క భయపడి అక్కడినుంచి పరుగులు తీస్తుంది. ఆ తర్వాత అదృష్టవశాత్తూ అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు కాపాడుకుంటుంది.

వైరల్ వీడియో..


ఈ వీడియో చాలా షాకింగ్‌గా ఉంది.. ఇది చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో asupan.reels.hewani అనే యూజర్ షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 1 లక్షా 79 వేల మంది వీక్షించగా.. 5 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. దీనిపై పలువురు ఫన్నీ కామెంట్లు కూడా చేశారు. మాటేసిన కుక్కకు.. మేక మంచి సమాధానం ఇచ్చిందంటూ పేర్కొంటున్నారు. కొంచెం అయితే.. కుక్కను చంపేసేదని.. మేక తిరగబడటం అరుదంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Viral Video: పిల్లికి సిక్స్‌ప్యాక్ ఫీవర్.. జిమ్‌కి వెళ్లి మరి చెమటోడ్చుతోంది.. వీడియో చూసి షాకవుతున్న నెటిజన్లు

Viral Video: ముందు సింహంలా గర్జించింది.. తీరా రింగులోకి దిగి గజగజ వణికింది.. ఫన్నీ వీడియో