
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ గురించి వార్తలు సందడి చేస్తున్న వేళ.. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక జంట వారి ప్రీ-వెడ్డింగ్ ఆల్బమ్ కోసం రికార్డ్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. గత సంవత్సరం ప్రారంభంలో తెగ ట్రెండ్ అయిన ఈ వీడియో ఇంటర్నెట్‌లో మళ్లీ వైరల్ అవుతోంది. ఒక బోట్ నడిపే బాబాయ్ ఫోటో షూట్‌ను ఎంతో పరిణితితో, రమ్యంగా డైరెక్ట్ చేయడం వీడియోలో చూడవచ్చు. ప్రి వెడ్డింగ్ షూట్ కల్చర్ ఇప్పుడు బాగా పెరిగిపోయింది. జస్ట్ ఏదో మెమరీలాగా మిగిలిపోడానికి ఓ వీడియో తీస్తే ఓకే.. కానీ ఈ మధ్య కొంతమంది తమ పైత్యాన్ని కూడా జోడించి వార్తల్లో నిలుస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీ వెడ్డింగ్ ఆల్బమ్ కల్చర్ బాగా పెరిగింది. తమ స్థాయి, స్థోమతకు తగ్గట్లు వీటిని ప్లాన్ చేసుకుంటున్నారు నూతన వధూవరులు. ఇక ప్రీ వెడ్డింగ్ వీడియో కోసం కచ్చితంగా ఏ కొలను వద్దో, నది వద్దో కచ్చితంగా విజువల్స్ తీయాల్సిందే. ఎందుకంటే అక్కడ అందమైన విజువల్స్ కెమెరాకు చిక్కుతాయి. మరి అలాంటి చోట షూట్ చేయాలంటే ఓ బోటు.. ఆ బోటు నడపడానికి చేయి తిరిగిన ఓ మనిషి కూడా కావాలి. ఈ బోటు బాబాయ్ అందులో ఎక్స్‌పర్ట్. చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసినట్లు ఉన్నాడు. ఇదిగో ఈ జంటకు ఐకానిక్ ఫోటో పోజులు ఎలా ఇవ్వాలో నేర్పిస్తున్నాడు. ప్రత్యేకంగా అనిపించేలా కొన్ని రొమాంటిక్ యాంగిల్స్ ఎలా చెయ్యాలో కూడా చూపిస్తున్నాడు.
వీడియో దిగువన చూడండి…
After seeing so many pre wedding shoots the boatman has become the director! 😀😛😂 #wedding #shoots pic.twitter.com/MCSmyFSsvl
— Ananth Rupanagudi (@Ananth_IRAS) May 30, 2024
ఈ వీడియో మరోసారి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. మే 30న సోషల్ మీడియా సైట్‌లో పోస్ట్ చేసిన తర్వాత, వీడియో ఇప్పటికే లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. X యూజర్స్ బోట్ బాబాయ్ డైరెక్షన్ స్కిల్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ క్లిప్‌పై నెటిజన్లు స్పందిస్తూ, బాబాయ్ నా ప్రి వెడ్దింగ్ షూట్‌కు నువ్వే డైరెక్టర్ అని ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. “చాలా ప్రీ వెడ్డింగ్ షూట్‌లు చూసిన తర్వాత, బోట్ నడిపే వ్యక్తి దర్శకుడిగా మారాడు” అని మరో వ్యక్తి వ్యాఖ్యానించాడు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..