Trending: పురాతన కాలానికి చెందిన వస్తువులు, నిధులు, దేవుళ్ల విగ్రహాలు బయటపడటం మనం చూస్తూనే ఉంటాం. నిర్మాణాల కోసం పునాదులు తవ్వుతున్నప్పుడు.. లేదా శిథిలావస్తకు చేరిన నిర్మాణాలను కూల్చివేసేటప్పడు ఇలాంటివి బయటపడుతూ ఉంటాయి. ఇలాంటి ఘటనలు గురించి మనం తరుచుగా వింటూనే ఉంటాం. కొందరికి గుప్త నిధులు దొరకడం వల్లే.. వాళ్లు ఉన్నపలంగా సిరిమంతులు అయ్యారని ఊళ్లలో చెబుతూ ఉంటారు. తాజాగా మేఘాలయ( Meghalaya) రాష్ట్రంలో పునాదులు తవ్వుతుండగా 2 పురాతన కత్తులు బయటపడ్డాయి. సౌత్ వెస్ట్ ఖాసీ హిల్స్ జిల్లా(South West Khasi Hills)లోని మావ్‌పుడ్ గ్రామం( Mawpud village)లో ఆగస్టు9న ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణానికి తవ్వకాలు జరపుతుండగా.. అర్బోర్న్‌సన్ వన్నియాంగ్ అనే యువకుడికి ఈ కత్తులు కనిపించాయి. వెంటనే వాటిని బయటకు తీసి శుభ్రం చేశారు. 2 కత్తులు పూర్తిగా తుప్పు పట్టిపోయాయి. ఈ విషయంలో తెలియడంతో స్థానికులు పెద్ద ఎత్తున వాటిని చూసేందుకు అక్కడికి చేరుకున్నారు. వాటి ఆకారం చూస్తుంటే యుద్ధం సమయంలో సైనికులు వినియోగించేవిగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పురావస్తు శాఖ అధికారులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆ 2 కత్తులు స్వాధీనం చేసుకుని.. అవి ఏ కాలానికి చెందినవో తెలుసుకునేందుకు పరిశీలనలు జరుపుతున్నారు. (Source)
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి