Anand Mahindra:తన భార్య కోసం కారు బుక్‌ చేసిన ఆనంద్‌ మహీంద్ర.. కానీ ఇంకా Q’లోనే ఉన్నారట..డెలివరీ ఎప్పటికో..!

సోషల్ మీడియాలో (Social Media )చాలా యాక్టీవ్ గా ఉండే వ్యాపార వేత్తల్లో ఆనంద్ మహీంద్ర ( Anand Mahindra )ఒకరు. నిత్యం తనకు నచ్చిన చక్కని వీడియోలు ( Trendin Videos ), ఫోటోలను షేర్ చేసి చాలా మందికి ప్రేరణ కలిగిస్తుంటారు.

Anand Mahindra:తన భార్య కోసం కారు బుక్‌ చేసిన ఆనంద్‌ మహీంద్ర.. కానీ ఇంకా Q’లోనే ఉన్నారట..డెలివరీ ఎప్పటికో..!
Anand Mahindra

Updated on: May 26, 2022 | 3:46 PM

సోషల్ మీడియాలో (Social Media )చాలా యాక్టీవ్ గా ఉండే వ్యాపార వేత్తల్లో ఆనంద్ మహీంద్ర ( Anand Mahindra )ఒకరు. నిత్యం తనకు నచ్చిన చక్కని వీడియోలు ( Trendin Videos ), ఫోటోలను షేర్ చేసి చాలా మందికి ప్రేరణ కలిగిస్తుంటారు. బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వినూత్న పద్ధతులను అవలంభిస్తున్న వారి పనులను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి తన అనుభవాన్ని పంచుకోవడంలోనూ ఆనంద్‌ మహీంద్రనే ముందుంటారు. ఇక నెటిజన్లు వేసే ప్రశ్నలకు ఆశ్చర్యకరంగా, గమ్మత్తుగా సమాధానం ఇస్తూ నవ్విస్తుంటారు…ఇక్కడ కూడా ఆనంద్‌ మహీంద్ర చేసిన ఓ పోస్ట్‌ నెట్టింట వైరల్ గా మారింది..

భారత జట్టు ఇటీవల తమస్ కప్ గెలిచి బ్యాడ్మింటన్ లో చరిత్ర సృష్టించింది. ఈ సంగతి మన అందరికీ తెలిసిందే. ఇందులో చిరాగ్ శెట్టి – రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ డబుల్ జోడి టీం విజయంలో కీలకంగా వ్యవహరించారు. ఇలా చరిత్ర సృష్టించిన భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.. దీనికి చిరాగ్ శెట్టి స్పందిస్తూ.. ధన్యవాదాలు తెలియజేశాడు. అలాగే తను మహేంద్ర కంపెనీ కి చెందినటువంటి xuv 700 కార్ బుక్ చేశానని, కాస్త త్వరగా డెలివరీ చేయాలని కోరాడు.. దీనికి ఆనంద్ మహీంద్రా చాలా వెరైటీగా బదులిచ్చారు. ఛాంపియన్ లకు ఎంపికగా మారినటువంటి xuv 700 ని వీలైనంత తొందరగా మీకు అందజేయడానికి ప్రయత్నం చేస్తాము. నేను కూడా నా భార్య కోసం ఒకటి ఆర్డర్ చేశాను. అయినా ఇప్పటికి నేను క్యూ లోనే ఉన్నాను. అంటూ బదులిచ్చారు ఆనంద్ మహీంద్రా.

దీంతో ఆనంద్ మహీంద్ర చేసిన ఈ ట్విట్‌ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మీకు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి సర్ అంటూ నెటిజన్లు ఆనంద్‌ మహీంద్ర ట్విట్‌కు ప్రశంసలు కురిపిస్తున్నారు.