Anand Mahindra: వారితో కలిసి కరోనా ప్రపంచకప్‌ నిర్వహిస్తానంటోన్న ఆనంద్‌ మహీంద్రా.. విజేతకు ఏమిస్తారంటే…

శాంతించిందనకున్న కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. ఒమిక్రాన్‌ రూపంలో అన్ని దేశాలను వణికిస్తోంది. మన దేశంలోనూ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇక మూడో వేవ్ ఆందోళనలను నిజం చేస్తూ కుప్పలు తెప్పలుగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.

Anand Mahindra: వారితో కలిసి కరోనా ప్రపంచకప్‌ నిర్వహిస్తానంటోన్న ఆనంద్‌ మహీంద్రా.. విజేతకు ఏమిస్తారంటే...
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 07, 2022 | 7:20 AM

శాంతించిందనకున్న కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. ఒమిక్రాన్‌ రూపంలో అన్ని దేశాలను వణికిస్తోంది. మన దేశంలోనూ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇక మూడో వేవ్ ఆందోళనలను నిజం చేస్తూ కుప్పలు తెప్పలుగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షల్లోకి వెళ్లిపోయాయి. నైట్‌ కర్ఫ్యూలు, వీకెండ్‌ లాక్‌డౌన్‌లు అమలుచేస్తున్నారు. కాగా గత రెండేళ్లుగా విడిచిపెట్టకుండా వేధిస్తున్న కరోనా మహమ్మారి గురించి నార్బెర్ట్‌ జోషి అనే నెటిజన్‌ ‘ నైజీరియాలో ఓ కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఇది యూకే వేరియంట్‌ కన్నా ఎంతో భిన్నమైనది’ అని రాసుకొచ్చాడు. దీనికి సుశీల్ యాదవ్ అనే మరో యూజర్‌ రిప్లై ఇస్తూ ‘ఒక్కో దేశంలో ఒక్కో వేరియంట్ వెలుగులోకి వస్తోంది. ఈ సంవత్సరం ఆఖరులో కరోనా వైరస్ ప్రపంచకప్ పెడితే ఎలా ఉంటుంది’ అని సరదాగా పేర్కొన్నాడు.

ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వ్యాపారవేత్తగా ఎంత బిజీగా ఉన్న తన పోస్టులతో నిత్యం స్ఫూర్తినింపుతుంటారాయన. అంతేకాదు మనకు తెలియకుండా మన చుట్టూ తిరుగుతున్న ఎంతోమంది సూపర్‌ హీరోస్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తుంటారు. ఇలా తన సోషల్‌ మీడియా పోస్టులతో నెట్టింట్లో సందడి చేసే ఆనంద్‌ మహీంద్రా ఈ ఛాట్‌ సెషన్‌లోకి ఎంటరయ్యారు. ‘ఐ సెకండ్ ది మోషన్’ అంటూ ఆ నెటిజన్లకు తన మద్దతు తెలిపారు. దానికి నవ్వుతున్న, చప్పట్లు కొడుతున్న ఎమోజీలను కూడా జతచేశారు. ఇక మహీంద్రా ట్వీట్‌కు శివాజీ అనే మరో నెటిజన్‌ స్పందిస్తూ ‘కరోనా ప్రపంచకప్ విజేతకు మహీంద్రా 700 బహుమతిగా ఇద్దాం ‘ అని హిలేరియస్‌ కామెంట్ పెట్టాడు.

Also read:

IND vs SA: రెండో టెస్టులో టీమిండియా ఓటమి.. దక్షిణాఫ్రికాకు గెలిపించిన కెప్టెన్‌ ఎల్గర్‌.. సిరీస్‌ సమం..

Viral video: నీళ్లకు బదులు ఉమ్మితో హెయిర్‌ స్టైలింగ్‌.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..

Viral video: మ్యాగీని చెడగొట్టేశారంటూ మండిపడుతున్న నెటిజన్లు.. కారణమేంటంటే..