Viral News: సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే వారిలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర మొదటి వరుసలో ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతిరోజూ ఏదో ఒక ఆసక్తికరమైన ట్వీట్‌ను పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తుంటారు మహీంద్ర. తన దృష్టికి వచ్చిన ఫన్నీ, స్ఫూర్తిదాయకమైన, విభిన్నంగా ఉన్న వస్తువులు ఇలా చెప్పుకుంటూ పోతే.. ఆనంద్ మహీంద్ర చేసే ప్రతీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆనంద్ మహీంద్ర తనను విపరీతంగా నవ్వించిన ఓ ఫొటోను ట్వీట్ చేశారు.
ఆనంద్ పోస్ట్ చేసిన ఫొటోలో జ్యూస్‌తో ఉన్న రెండు గ్లాసులు ఉన్నాయి. అందులో మొదటి గ్లాస్ పక్కన ‘Juice’ అని రాసి ఉంది. అలాగే కింది గ్లాసులో కాస్త తక్కువ డ్రింక్‌తో ఉన్న గ్లాసు పక్కన ‘Ju’ అని రాసి ఉంది. ఈ ఫొటోను పోస్ట్ చేసిన మహీంద్ర.. ‘బహుశా శుక్రవారం కారణంగా నా మెదడు అంత చురుకుగా పనిచేయడం లేదు. ఎందుకంటే ఈ జోక్‌ను అర్థం చేసుకోవడానికి నాకు నిమిషం పట్టింది. ఈ ఫొటోలోని జోక్ అర్థం కాగానే నేను ఒక్కసారి విరగపడి నవ్వాను. దీంతో కుర్చీలో కూర్చున్న నా భార్య చెంగున ఎగిరింది’ అంటూ రాసుకొచ్చారు.
Maybe it’s Friday & my mind is slowing down for the oncoming weekend because it took me a minute to get the joke. When I did, I laughed out so loudly my wife jumped out of her chair… pic.twitter.com/4SfjHQ8xMt
— anand mahindra (@anandmahindra) August 12, 2022
ఇంతకీ ఆనంద్ మహీంద్రను అంతలా నవ్వించిన ఈ ఫొటోలో దాగున్న జోక్ ఏంటో మీకు అర్థమైందా.? ఏం లేదండి మొదటి గ్లాసు జ్యూస్‌లో ‘ఐస్’ ఉంది కాబట్టి Juice అన్నారు. రెండు గ్లాసులో ‘ఐస్’ లేదు కాబట్టి ‘JU’గా పేర్కొన్నారు. సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి మనుషుల్లో క్రియేటివిటీ ఏ స్థాయిలో పెరిగిందో చెప్పడానికి ఈ పోస్ట్ చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది కదూ.!
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..