Watch Video: ఏం ఐడియా..ఆనంద్‌ మహీంద్ర ఇంప్రెస్‌..! పిల్లలకు పరిశుభ్రత నేర్పే పాఠాలు అదుర్స్‌ అంటూ..

|

Jan 08, 2024 | 12:21 PM

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ విషయాలను ఇంట్లో పిల్లలకు నేర్పించాలని ఓ యూజర్ చెప్పారు. కొన్ని చోట్ల ఇటువంటి పథకాలు పాఠశాలల్లో అమలు చేయబడతాయని మరొక వినియోగదారు చెప్పారు. పిల్లలు పాఠశాలలో మాత్రమే ఉత్సాహంగా ఇలాంటి పనులు చేస్తుంటారని, ఇంట్లో ఇలాంటి పనులు చేయామంటే మొండికేస్తారని మరొకరు పేర్కొన్నారు.

Watch Video: ఏం ఐడియా..ఆనంద్‌ మహీంద్ర ఇంప్రెస్‌..!  పిల్లలకు పరిశుభ్రత నేర్పే పాఠాలు అదుర్స్‌ అంటూ..
Anand Mahindra
Follow us on

మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా X (Twitter)లో షేర్ చేసిన పోస్ట్‌లను చాలా మంది వినియోగదారులు ఇష్టపడుతున్నారు. ఇందులో చాలా వరకు వినోదభరితమైన, ఉల్లాసభరితమైన వీడియోలు, అలాగే కొన్ని స్ఫూర్తిదాయకమైన పోస్ట్‌లు ఉన్నాయి. ఆయన షేర్‌ చేసే అన్ని పోస్ట్‌లు ప్రజల దృష్టిని ఎంతగానో ఆకర్షిస్తుంది. అందుకే ఆనంద్‌ మహీంద్ర సోషల్ మీడియా ఖాతా ఫాలోవర్స్‌ కూడా ఎక్కువగానే ఉంటారు.. జుగాడ్ టెక్నాలజీపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచే ఆనంద్ మహీంద్రా ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ద్వారా పిల్లల్లో పరిశుభ్రత అలవర్చాలనే ఆలోచనను వారికి కలిగింది.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో అదోక క్లాస్ రూమ్‌గా తెలుస్తోంది. తరగతి గదిలో కొంతమంది పిల్లలు కూర్చోవడానికి బెంచీలు కూడా ఉన్నాయి.. అంతలోనే ఓ ఉపాధ్యాయురాలు.. క్లాస్‌కి వచ్చి కొన్ని బొమ్మలు, ఇతర ఆట వస్తువులు, తరగతిలోని కుర్చీలను ఆ రూమంతా చెల్లచెదురుగా పడేట్టు చేస్తుంది. ఆ తరువాత, ఆ టీచర్ విద్యార్థులను పిలిచి, ప్రతి ఒక్కరినీ వారి వారి స్థానాల్లో కూర్చోమని చెబుతుంది. దాంతో విద్యార్థులందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ.. క్లాస్‌రూమ్‌ మొత్తాన్ని క్లీన్ చేసే పనిలో పడ్డారు.. గది నిండా చెల్లాచెదురుగా పడివున్న అన్ని వస్తువులను తిరిగి యధావిధిగా ఉంచుతారు. పిల్లలకు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే నేర్పించే పాఠాలు ఎలా చెబుతున్నారో ఒకసారి మీరు కూడా ఈ వీడియో ద్వారా చూడండి.

ఇవి కూడా చదవండి

ఆనంద్ మహీంద్రా ఆ వీడియోను చూసి, దానిని తన X (ట్విట్టర్)లో రీపోస్ట్ చేస్తూ ఇలా అన్నారు.. పిల్లలకు పరిశుభ్రత, శుభ్రత, పరస్పర సహకారం వంటి సద్గుణాలను ఎలా పెంపొందించుకోవాలో చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ… మనం కూడా అంగన్‌వాడీలలో, ప్రాథమిక పాఠశాలల్లో ఇలాంటి క్రియాశీలక పాఠాలు పిల్లలకు నేర్పించేలా ఏర్పాట్లు చేయాలని మన విద్యావ్యవస్థలను కోరుతున్నారు.

ఈ వీడియో ఆనంద్ మహీంద్రా యొక్క X (ట్విట్టర్) ఖాతా @anandmahindra నుండి సోషల్ మీడియాలో షేర్‌ చేయబడింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ విషయాలను ఇంట్లో పిల్లలకు నేర్పించాలని ఓ యూజర్ చెప్పారు. కొన్ని చోట్ల ఇటువంటి పథకాలు పాఠశాలల్లో అమలు చేయబడతాయని మరొక వినియోగదారు చెప్పారు. పిల్లలు పాఠశాలలో మాత్రమే ఉత్సాహంగా ఇలాంటి పనులు చేస్తుంటారని, ఇంట్లో ఇలాంటి పనులు చేయామంటే మొండికేస్తారని మరొకరు పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..