Viral News: బాత్రూమ్ గోడను రిపేర్ చేస్తోన్న ప్లంబర్‌కు ఊహించని షాక్.. బద్దలకొట్టి చూడగా ఫ్యూజులు ఔట్!

అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది. దురదృష్టం తలుపు తీసేదాకా తడుతూనే ఉంటుంది. ఈ సామెత మనందరికీ తెలిసిందే...

Viral News: బాత్రూమ్ గోడను రిపేర్ చేస్తోన్న ప్లంబర్‌కు ఊహించని షాక్.. బద్దలకొట్టి చూడగా ఫ్యూజులు ఔట్!
Plumber

Updated on: Dec 16, 2021 | 4:51 PM

అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది. దురదృష్టం తలుపు తీసేదాకా తడుతూనే ఉంటుంది. ఈ సామెత మనందరికీ తెలిసిందే. అదృష్టం ఎప్పుడు.. ఎలా.. ఎవర్ని వరిస్తుందో తెలియదు గానీ.. ఎవరికైనా సరే జీవితంలో ఒక్కసారి మాత్రం అదృష్టం వరిస్తుంది. అయితే ఇక్కడొక వ్యక్తికి అదృష్టం ఒక్క స్ట్రైక్‌లో వరించింది. అయితే నిజాయితీతో అతడు డబ్బును కాస్త పోలీసులకు అప్పగించాడు. అమెరికాలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

టెక్సాస్‌కు చెందిన జస్టిన్ కౌలీ అనే ప్లంబర్ స్థానికంగా ఉండే ఓ చర్చిలోని బాత్రూమ్ గోడ రిపేర్ చేసేందుకు వెళ్లగా.. అక్కడ అతడికి కళ్లు తిరిగే షాక్ తగిలింది. ఆ బాత్రూమ్ గోడను రిపేర్ చేస్తుండగా.. అతడికి అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌(Plaster Of Paris)తో తయారు చేసిందని గ్రహిస్తాడు. దానిని బద్దలకొట్టగా రూ. 4.5 కోట్లు బయటపడ్డాయి. అంత పెద్ద మొత్తంలో డబ్బులు చూసిన అతడికి మొదట ఆశ్చర్యం కలిగినా.. ఆ తర్వాత తేరుకుని నిజాయితీతో ఆ డబ్బును పోలీసులకు అప్పగించాడు.

ఇదిలా ఉంటే.. ఓ ఆంగ్ల వెబ్‌సైట్ నివేదిక ప్రకారం.. ఆ డబ్బు 2014 సంవత్సరంలో చర్చి నుంచి దొంగలించబడిందని తెలుస్తోంది. అప్పట్లో దానిని కనిపెట్టేందుకు దర్యాప్తు సంస్థలు రూ. 3 లక్షల రివార్డును కూడా ప్రకటించాయట. అయినప్పటికీ ఎవ్వరూ డబ్బు ఆచూకీని కనిపెట్టలేకపోయారు. అయితే ఇప్పుడు జస్టిస్ కౌలీ ఆ డబ్బును కనిపెట్టడం.. పోయిన మొత్తం మళ్లీ తిరిగి రావడంతో చర్చి నిర్వాహకులు అతడికి రూ. 15 లక్షలు బహుమతిగా ఇచ్చారు. ఇక ఈ వార్త ప్రస్తుతం ప్రపంచ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read:

23 బంతుల్లో 106 పరుగులు.. 6గురి బౌలర్ల ఊచకోత.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన కోహ్లీ టీమ్‌మేట్.. ఎవరో తెలుసా!

ఈ ఫోటోలో చిరుత దాగుంది.. పజిల్ సాల్వ్ చేస్తే గ్రేటే.. ఫెయిల్ అవ్వడం ఖాయం!

మన కరెన్సీ నోట్లపై నల్లటి గీతలు మీరెప్పుడైనా చూశారా.? అవి ఎందుకో ఆలోచించారా.!