బ్రిటీష్ మూలాలు ఉన్నప్పటికీ, అంబాసీడర్‌ను భారతీయ కారుగానే భావిస్తారు. గతంలో అంబాసిడర్ కారు రోడ్డుపైకి వస్తే.. దాని హవా వేరు. ఈ అంబాసిడర్ కారు ఆ రోజుల్లో కార్లలో కింగ్. ‘కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్’ గా దీనికి పేరు ఉండేది. భారత ఆర్మీ అధికారుల నుంచి ప్రభుత్వ కార్యాలయ అధికారుల వరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సినిమా సెలబ్రిటీలు ఈ అంబాసిడర్ కారునే వినియోగించేవారు. 90వ దశాబ్ధంలో ఈ కారు ఉంటే.. వారు రిచ్ అన్నట్లే లెక్క. అంబాసీడర్ స్టేటస్‌కి ఓ సింబల్‌గా చెప్పేవారు. ప్రస్తుతం జనరేషన్‌కి తగ్గుట్టు ఈ కారు అప్ డేట్ అవ్వకపోవడంతో అమ్మకాలు భారీగా పడిపోయాయి.
తాజాగా పాత పాస్‌పోర్ట్‌లు, సినిమా టిక్కెట్లు తదితర పాత వస్తువులకు సంబంధించిన అరుదైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఇదే తరహాలో 1964 నాటి అంబాసిడర్ కారు బిల్లు వైరల్‌గా మారింది. అప్పట్లో అంబాసిడర్ కారు ధర చూసి నెటిజన్లు షాకవుతున్నారు. 1964లో అంబాసిడర్ కారు బిల్లును మద్రాస్ ట్రెండ్స్ అనే ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేశారు. ఈ కారును అక్టోబర్ 20, 1964న కొనుగోలు చేశారు. 1964లో అంబాసిడర్ ధర రూ.16,495. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పాత బిల్లుపై మీరూ ఓ లుక్కేయండి.
వైరల్ బిల్లు ప్రకారం, కారు ధర రూ.13,787. దీనితో పాటు సేల్స్ ట్యాక్స్ రూ.1493. రవాణా రుసుము రూ. 897. అదనంగా, కారు నంబర్ ప్లేట్‌కు రూ.7 వంటి ఛార్జీలను జోడించి మొత్తం రూ.16,495కి విక్రయించినట్లుగా ఆ బిల్లులో ఉంది. కాగా ఇప్పటికీ కొంతమంది ఈ కార్లపై ఇష్టం ఉన్నవారు.. పాత కార్లను రీ మోడలింగ్ చేయించి మరీ వినియోగిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..