Telugu News Trending Ambani family dances at the ring ceremony of Anant Ambani and Radhika Merchant Telugu News
కొడుకు నిశ్చితార్థ వేడుకలో కుటుంబంతో కలిసి డ్యాన్స్ చేసిన అంబానీ..! అద్భుతమైన వీడియో వైరల్..
ఈ సందర్భంగా వధూవరులను వేదికపైకి తీసుకొచ్చేందుకు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ తమ పిల్లలు, కోడళ్లు, కోడళ్లతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ సమయంలో అమ్మా నాన్న డ్యాన్స్ చూసి అనంత్ చాలా సంతోషించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. దీంతో ఇప్పుడు దేశం మొత్తం దృష్టిని ఆకర్షించింది వీరి నిశ్చితార్థ వైభవం. అంతేకాదు, కొడుకు నిశ్చితార్థ వేడుకలో నీతా, ముఖేష్ అంబానీ కుటుంబం కలిసి స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబైలోని ముకేశ్ అంబానీ నివాసం ‘యాంటిల్లా’లో నిన్న నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ సందర్బంగా కొడుకులు, కోడళ్లతో కలిసి అంబానీ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
#WATCH | The Ambani family dances at the ring ceremony of Anant Ambani and Radhika Merchant
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఎంకోర్ హెల్త్‌కేర్ సీఈవో విరెన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌తో గురువారం అంబానీ నివాసం యాంటిల్లాలో నిర్వహించిన ఈ నిశ్చితార్థ కార్యక్రమం సందడిగా సాగింది. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, పెద్ద కుమారుడు ఆకాశ్, కోడలు శ్లోకా, కూతురు ఇషా అంబానీ, అల్లుడు ఆనంద్ పిరమళ్- ఆటపాటలతో కట్టిపడేశారు. హమ్ ఆప్ కే హై కౌన్ సినిమాలోని వహ్ వహ్ రామ్ జీ పాటకు డాన్స్ చేశారు. అద్దిరిపోయే స్టెప్పులేశారు. ఈ సందర్బంగా రాధిక మర్చంట్ ధరించిన బంగారంతో అలంకరించబడిన లెహంగా మరింత ఎట్రాక్షన్‌గా నిలిచింది.
#WATCH | Engagement of Anant Ambani and Radhika Merchant held at Mukesh Ambani’s Mumbai residence ‘Antilla’ yesterday pic.twitter.com/igSZQ9fOT5
ఈ నిశ్చితార్థ కార్యక్రమాని వైభవంగా నిర్వహించారు. కొద్దిమందికి మాత్రమే ఆహ్వానించినట్టుగా తెలిసింది. ముఖేష్ అంబానీ- వీరేన్ మర్చంట్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఇందులో పాల్గొన్నారు. గుజరాతీ సంప్రదాయంలో ఈ కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా వధూవరులను వేదికపైకి తీసుకొచ్చేందుకు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ తమ పిల్లలు, కోడళ్లు, కోడళ్లతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ సమయంలో అమ్మా నాన్న డ్యాన్స్ చూసి అనంత్ చాలా సంతోషించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.