Viral Video: కదులుతున్న రైలు ఎక్కేందుకు యత్నించిన వ్యక్తి.. తర్వాత ఏమైదంటే..

|

Nov 17, 2021 | 11:26 AM

రైల్వే స్టేషన్లలో జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది పట్టాలు దాటేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఉపయోగించరు. మరి కొందరు రన్నింగ్ రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో కిందపడిపోతారు. అలాగే ట్రైన్ నడుస్తున్నప్పుడు తిగుతారు. ఇది కూడా ప్రమాదమే..

Viral Video: కదులుతున్న రైలు ఎక్కేందుకు యత్నించిన వ్యక్తి.. తర్వాత ఏమైదంటే..
Train
Follow us on

రైల్వే స్టేషన్లలో జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది పట్టాలు దాటేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఉపయోగించరు. మరి కొందరు రన్నింగ్ రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో కిందపడిపోతారు. అలాగే ట్రైన్ నడుస్తున్నప్పుడు తిగుతారు. ఇది కూడా ప్రమాదమే. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. మహారాష్ట్రలోని కళ్యాణ్ జంక్షన్ రైల్వే స్టేషన్‎లో ఓ ప్రయాణికుడు కదులుతున్న రైలు ఎక్కబోయి రైలు కింద పడబోయాడు. రైల్లోని ప్రయాణికులు చైన్ లాగడంతో ట్రైన్ ఆగిపోయింది. అతడిని పాయింట్స్ మ్యాన్ వెంటనే పైకి లాగారు. ఇందుకు సంబంధించిన వీడియోను డీఆర్ఎం ముంబై సీఆర్ ట్విట్టర్‎లో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

నవంబర్ 14న ఉదయం 11 గంటల 54 నిమిషాలకు హౌరా-ముంబై ప్రత్యేక రైలు కళ్యాణ్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. అదే సమయంలో ఓ ప్రయాణికుడు ట్రైన్ ఎక్కే ప్రయత్నం చేశాడు. పట్టు తప్పి ప్లాట్ ఫామ్, రైలుకు మధ్య చిక్కుకు పోయాడు. దాదాపు 10 మీటర్ల దూరం వరకు వెళ్లాడు. ఇంతలో రైలులో ఉన్న ప్రయాణికులు చైన్ లాగారు. అదే సమయంలో అతడిని గుర్తించిన పాయింట్ మ్యాన్ శివ్‌జీ సింగ్‌ సెకన్ల వ్యవధిలో స్పందించి అతడిని పైకి లాగాడు.

కొద్ది రోజుల క్రితం కళ్యాణ్ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలును దిగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు జారిపడిన గర్భిణీ స్త్రీని కాపాడారు.

కర్ణాటకలోని శివమొగ్గ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు నుంచి ఓ మహిళ దిగేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె రైలు కింద పడబోయింది. వెంటనే స్పందించిన ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్ సిబ్బంది ఆమెను బయటకు లాగారు. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది.

Read Also.. Viral Video: తగ్గెదేలే.. ఫిట్నెస్‌పై దృష్టిపెట్టిన శునకం.. కసరత్తులు చూసి షాకవుతున్న నెటిజన్లు.. వీడియో వైరల్