Watch Video: బోర్ కొడుతుందని చేపలు పట్టేందుకు వెళ్లాడు.. చివరకు ఊహించని షాక్.. వీడియో వైరల్

|

Apr 04, 2022 | 10:31 AM

Alberta man catches living dinosaur: బోర్ కొడుతుందని ఓ యువకుడు సరదాగా చేపలు పట్టేందుకు వెళ్లాడు.. సరస్సులో చేపలు పట్టేందుకు గాలం వేయగా.. భారీ వస్తువు తగినట్లు అనిపించింది. కట్ చేస్తే..

Watch Video: బోర్ కొడుతుందని చేపలు పట్టేందుకు వెళ్లాడు.. చివరకు ఊహించని షాక్.. వీడియో వైరల్
Fish
Follow us on

Alberta man catches living dinosaur: బోర్ కొడుతుందని ఓ యువకుడు సరదాగా చేపలు పట్టేందుకు వెళ్లాడు.. సరస్సులో చేపలు పట్టేందుకు గాలం వేయగా.. భారీ వస్తువు తగినట్లు అనిపించింది. కట్ చేస్తే.. రాక్షస బల్లిగా పేర్కొనే సుమారు రెండు క్వింటాల చేప ఒడ్డుకు చేరింది. దాన్ని తీసుకొచ్చేందుకు సుమారు రెండు గంటలపాటు శ్రమించాడు. ఈ ఘటన కెనడాలోని అల్బెర్టా (Alberta) లో జరిగింది. అల్బెర్టాలోని ఓ వ్యక్తి చేపలు పట్టడానికి వెళ్లగా.. అతనికి 8 అడుగుల 6 అంగుళాల పొడవు గల స్టర్జన్‌ అనే చేప దొరికింది. దీనిని ‘లివింగ్ డైనోసర్’ (రాక్షస బల్లి) అని పేర్కొంటారు. దీని బరువు దాదాపు 159 కిలోలు ఉన్నట్లు అక్కడి మీడియా సంస్థలు వెల్లడించాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట (Social Media) వైరల్ అవుతోంది.

CTV న్యూస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రూఫర్ బ్రేడెన్, రూస్ ఇద్దరూ కలిసి నదిలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ సమయంలో గాలానికి భారీ వస్తువు తగినట్లు అనిపించింది. దీంతో అతని స్నేహితుడు వీడియోను చిత్రీకరించాడు. ఈ సరాదా వేటలో ట్రయాసిక్ యుగం (ప్రాచీనకాలం) నాటి రాక్షసబల్లి అని పిలిచే చేప దొరికింది. సిడ్నీ కోజెలెంకో ఫ్రేజర్ నదిలో ఫిషింగ్ చేసినట్లు రూఫర్ తెలిపాడు. మొదట ఏదో వస్తువు అనుకున్నానని.. కానీ ఒడ్డుకు చేరిన తర్వాత చేపగా నిర్ధారించుకున్నట్లు వెల్లడించాడు.

వైరల్ వీడియో.. 

దీన్ని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు తీసుకెళ్లేందుకు అర్ధగంట తీవ్రంగా శ్రమ పడినట్లు పేర్కొన్నాడు. శక్తివంతమైన చేప (స్టర్జన్) బలానికి ఒడ్డుకు తీసుకురావడం మామూలు విషయం కాదని తెలిపాడు. అయితే.. దాన్ని కాసేపు పరిశీలించిన తర్వాత రూఫర్, రూస్ కలిసి తిరిగి నీటిలోకి వదిలారు. కాగా.. ఈ చేప ప్రాచీన యుగం నాటిదని.. దీన్ని అంత ఈజీగా పట్టుకోలేమంటూ పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుతం దీనిని సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Also Read:

Viral Video: సింహం దాడి చేస్తే ఇంత భయంకరంగా ఉంటుందా.! వైరల్‌ అవుతోన్న షాకింగ్ వీడియో..

Primeval Foods: త్వరలో అంగడిలో అమ్మకానికి సింహం, పులి, ఏనుగు మాంసాలు.. వెరైటీ వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్‌కి రెడీ.. ఎక్కడంటే