ఫ్లైట్‌లో బొద్దింక.. చనిపోయే వరకు ఉరి తీసిన సిబ్బంది.. నెట్టింట నవ్వులే నువ్వులు..

ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్లే విమానంలో ఒక ప్రయాణికుడు బొద్దింకను చూశాడు. ఈ సమస్యను విమానం చెకింగ్ రికార్డులో నమోదు చేశారు. సిబ్బంది ఆ సమస్యను పరిష్కరించి.. బుక్‌లో రాశారు. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అసలు ఆ బుక్‌లో సిబ్బంది ఏం రాశారు..? అనేది తెలుసుకుందాం..

ఫ్లైట్‌లో బొద్దింక.. చనిపోయే వరకు ఉరి తీసిన సిబ్బంది.. నెట్టింట నవ్వులే నువ్వులు..
Air India Cockroach Logbook Entry Sparks Laughter

Updated on: Oct 27, 2025 | 8:56 AM

ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన ఒక రికార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్లైట్ సిబ్బంది రాసిన ఒక మాట చూసి అందరూ నవ్వుకుంటున్నారు. ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో ఒక ప్యాసింజర్ బొద్దింకను చూశాడు. ఈ సమస్యను విమానం చెకింగ్ రికార్డులో రాశారు. ఆ సమస్యను సరిచేసిన ఇంజనీర్ తన పని గురించి రికార్డులో ఇలా రాశాడు.. ‘‘బొద్దింక చనిపోయే వరకు ఉరితీశాం’’. ఈ విషయాన్ని జర్నలిస్ట్ జాగృతి చంద్ర సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “ఖలాస్ దుబాయ్ స్టైల్” అని పెట్టడంతో ఇది వెంటనే వైరల్ అయింది. ఖలాస్ అంటే పూర్తైంది అని అర్థం.

ఇంజనీర్ రాసిన ఈ సరదా మాట చూసి నెటిజన్లు రకరకాల జోకులు వేస్తున్నారు. కొందరు దాన్ని “బొద్దింకల భగత్ సింగ్” అన్నారు. “ఆ బొద్దింకను ఏ కోర్టు శిక్షించింది?” అని మరికొందరు కామెంట్లు చేశారు. శరీరాన్ని కుటుంబానికి అప్పగించారా, ఇంజనీర్ కి ప్రమోషన్ ఇవ్వాలని కామెంట్లు చేశారు.

సాధారణంగా క్యాబిన్ లోపాల లాగ్‌బుక్‌లు అనేవి విమానంలో తలెత్తే టెక్నికల్, శానిటరీ సమస్యలను నమోదు చేయడానికి ఉపయోగిస్తారు. విమానం ప్రయాణానికి సిద్ధమయ్యే ముందు ఈ సమస్యలను పరిష్కరించడానికి లాగ్‌లు ఉపయోగపడతాయి. అయితే ఎయిర్ ఇండియా రికార్డులలో ఇది అత్యంత హాస్యాస్పదమైన, చిరస్మరణీయమైన ఎంట్రీగా నిలిచిపోయింది.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us