Video: ఈ బూట్లతో నీళ్లపై నడవొచ్చు.. గాల్లో ఎగరొచ్చు..! మతిపోగొట్టే క్రియేటివిటీ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏఐ వీడియోలు నిజమా, కాదా అని గుర్తించడం కష్టంగా మారింది. పులి మనిషిని లాక్కెళ్లే దృశ్యం లేదా గాల్లో తేలియాడే షూస్‌ లాంటి అవాస్తవిక వీడియోలు కూడా నిజమని నమ్మించేలా ఉన్నాయి. సామాన్యులతో పాటు మీడియాను కూడా ఇవి తప్పుదోవ పట్టిస్తున్నాయి.

Video: ఈ బూట్లతో నీళ్లపై నడవొచ్చు.. గాల్లో ఎగరొచ్చు..! మతిపోగొట్టే క్రియేటివిటీ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
Ai Videos

Updated on: Nov 12, 2025 | 10:44 PM

ఏఐ వచ్చిన తర్వాత.. సోషల్‌ మీడియాలో ఏ వీడియో రియలో? ఈ వీడియో ఏఐ జనరేటెడో అర్థం చేసుకోవడం కష్టంగా మారింది. మన కళ్లను మోసం చేస్తూ నిజంగానే జరిగిందా అన్నట్లు ఏఐ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. మొన్నటి మొన్న ఓ పులి మనిషిని లాక్కెళ్తున్న వీడియో అంటూ ఓ వీడియో సంచలన సృష్టించింది. ప్రముఖ మీడియా సంస్థలు కూడా అది నిజమైన వీడియో అంటూ వార్తలు ప్రసారం చేసింది. కానీ, తర్వాత అది ఏఐ వీడియో అని తేలింది. అలా సామాన్యులనే కాదు మీడియాను కూడా ఈ ఏఐ వీడియోలు మాయ చేస్తున్నాయి. అయితే ఈ ఏఐ వీడియోలను క్రియేట్‌ చేసే క్రియేటర్లను ఎంత మెచ్చుకున్న తక్కువే.

తాజాగా ప్రత్యేకమైన షూలతో గాల్లో తేలుతున్నట్లు, నీళ్లపై నడుస్తున్నట్లు ఏఐ వీడియోలు క్రియేట్‌ చేస్తున్నారు. అవి చూసేందుకు నిజం అనిపించేలా ఉన్నాయి. పాపం చాలా మంది నెటిజన్లు వాటిని నిజం అనే నమ్ముతున్నారు. టెస్లా లాంటి ప్రముఖ కంపెనీలు వాటిని రూపొందించినట్లు వీడియోల చెప్తుండటంతో నిజమే కావొచ్చు అంటూ వాటిని విపరీతంగా షేర్‌ చేస్తున్నారు. ఆ వీడియోలు చూస్తూ ఎవరైనా ఫిదా అయిపోయేలా ఉన్నాయి. ఎంతైనా వారి క్రియేటివిటీకి సలాం కొట్టాల్సిందే. అంత రియలిస్టిక్‌గా ఉన్నాయి ఆ వీడియోలు. మీరు కూడా కింద ఉన్న ఆ వీడియోలు చూసేయండి.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి