“పాక్ ప్రధాని”కి బీజేపీ సభ్యత్వం.. పిచ్చ పీక్‌కి చేరిన సోషల్ మీడియా వైనం

| Edited By:

Jul 29, 2019 | 2:04 PM

దేశ వ్యాప్తంగా బీజేపీ సభ్యత్వ నమోదు ప్రక్రియలో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. అయితే ఆన్‌లైన్, మిస్ కాల్ ద్వారా కూడా మెంబర్ షిప్‌కి అవకాశం ఉండటంతో.. ఎవరు చేస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే సోషల్ మీడియాలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేరుతో బీజేపీ సభ్యత్వ నమోదు తీసుకున్న ఫోటోలు వైరల్‌గా మారాయి. దీంతో రంగంలోకి దిగిన బీజేపీ అధికారులు.. ఘటనపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు..దర్యాప్తు […]

పాక్ ప్రధానికి బీజేపీ సభ్యత్వం.. పిచ్చ పీక్‌కి చేరిన సోషల్ మీడియా వైనం
Follow us on

దేశ వ్యాప్తంగా బీజేపీ సభ్యత్వ నమోదు ప్రక్రియలో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. అయితే ఆన్‌లైన్, మిస్ కాల్ ద్వారా కూడా మెంబర్ షిప్‌కి అవకాశం ఉండటంతో.. ఎవరు చేస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే సోషల్ మీడియాలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేరుతో బీజేపీ సభ్యత్వ నమోదు తీసుకున్న ఫోటోలు వైరల్‌గా మారాయి. దీంతో రంగంలోకి దిగిన బీజేపీ అధికారులు.. ఘటనపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు..దర్యాప్తు వేగవంతం చేశారు. గుజరాత్‌ అహ్మదాబాద్‌కి చెందిన గులాం ఫరీద్ షేక్‌ దీనికి పాల్పడ్డాడని గుర్తించారు. దీంతో అతనిపై ఫోర్జరీ కేసు నమోదు చేశారు. అయితే అతడు పాక్ ప్రధానికే కాకుండా.. అత్యాచార నిందితులు.. డేరా బాబా, ఆశారాం బాపూల పేరుతో కూడా ఈ-సభ్యత్వం తీసుకున్నాడు. అనంతరం ఇమ్రాన్, డేరాబాబా, ఆశారాంల పేర్లు, ఫోటోలతో ఉన్న బీజేపీ సభ్యుత్వ కార్డులను ఫరీద్ సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో.. ఈ వ్యవహారం బీజేపీ నేతల దృష్టికి వెళ్లింది. దీంతో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకే అతడు ఇలా చేస్తున్నాడంటూ అహ్మదాబాద్ బీజేపీ నేత కమలేశ్ పటేల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.