Viral Video: వయసు ఒక నెంబర్ మాత్రమే.. 2 మీటర్ల ఎత్తున్న ఆస్పత్రి గేటుని చకచకా దాటేసిన 92 ఏళ్ల బామ్మ

|

Jul 15, 2024 | 12:02 PM

వైరల్ అవుతున్న వీడియోలో ఒక వృద్ధ మహిళ నర్సింగ్ హోమ్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు మీరు చూడవచ్చు. హాస్పటల్ ఆవరణకు ముందు 2 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఒక గేటు ఉంది. ఆ గేటు మీద ఆ బామ్మ ఆనందంతో ఎక్కడం కనిపిస్తుంది. ఈ వృద్ధురాలు తీవ్ర అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. ఆ బామ్మ అంత పెద్ద గేటు చాలా సులభంగా దాటడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Viral Video: వయసు ఒక నెంబర్ మాత్రమే.. 2 మీటర్ల ఎత్తున్న ఆస్పత్రి గేటుని చకచకా దాటేసిన 92 ఏళ్ల బామ్మ
Woman Video Viral
Follow us on

ఇంటర్నెట్ ప్రపంచంలో యాక్టివ్‌గా ఉన్నవారు రోజు రకరకాల వీడియోలు చూస్తూనే ఉంటారు. వీటిల్లో కొన్ని వీడియోలు చూస్తే అసలు ఇది నిజమేనా అని నమ్మడం కష్టం అని అనుకుంటే.. నిజంగా ఇలా జరుగుతుందా అని ఆలోచిస్తారు. కొన్ని రకాల వీడియోలు చూసిన తర్వాత కళ్లను నమ్మడం కూడా కొంచెం కష్టమవుతుంది. ఇలాంటి వీడియోలను ఇంటర్నెట్‌లో చూడటమే కాదు ఒకరితో ఒకరు విరివిగా షేర్ చేసుకోవడానికి కూడా ఇదే కారణం. ఈ వీడియోలు విడుదలైన వెంటనే ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారడానికి కారణం ఇదే. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం ఓ రేంజ్ లో చర్చనీయాంశమైంది.

వయసు పెరిగే కొద్దీ మనిషి శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ఏ పని చేయలన్నా తమ శరీరం సహకరించడం లేదు అని అందుకే చాలా మంది వాపోతూ ఉంటారు. దీని అర్థం ఏమిటంటే మనుషులకు వయస్సుతో పాటు అతని శరీరం తీరు మారుతూ ఉంటుంది. అంతేకాదు ఎప్పటికీ ఒకేలా పని చేయడం కూడా కష్టమే. అయితే ఎవ్వరూ లేవాలని కూడా ఆలోచించని వయసులో కూడా కొన్ని రకాల పనులు చేసి షాక్ ఇచ్చే వృద్ధులు కూడా ఉన్నారు. ఇప్పుడు 92 ఏళ్ల వృద్ధురాలు చేసిన ఒక ఫీట్ కు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇక్కడ వీడియో చూడండి

ఇవి కూడా చదవండి

 

వైరల్ అవుతున్న వీడియోలో ఒక వృద్ధ మహిళ నర్సింగ్ హోమ్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు మీరు చూడవచ్చు. హాస్పటల్ ఆవరణకు ముందు 2 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఒక గేటు ఉంది. ఆ గేటు మీద ఆ బామ్మ ఆనందంతో ఎక్కడం కనిపిస్తుంది. ఈ వృద్ధురాలు తీవ్ర అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. ఆ బామ్మ అంత పెద్ద గేటు చాలా సులభంగా దాటడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ వృద్ధురాలు చక చక గేటుని ఎక్కి..ఆస్పత్రి ఆవరణ బయటకు దిగుతోంది. అయితే, షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని నర్సింగ్ హోమ్ సిబ్బంది వెంటనే స్పందించి .. ఆ బామ్మని చుట్టుపక్కల ప్రాంతంలో వెదికి పట్టుకున్నారు.

ఈ వీడియో ఫేస్‌బుక్‌లో షేర్ చేయబడింది. ఈ వార్త రాసే వరకు వేల మంది దీనిని చూసి కామెంట్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఒకరు ఇలా వ్రాశారు, ‘వయస్సు కేవలం ఒక సంఖ్య అని ఈ వృద్ధ స్త్రీ చెప్పకనే చెప్పింది.’ మరొకరు ‘ఆమె వయసు రీత్యా వృద్ధురాలు.. మనసు రీత్యా యువకుడని స్త్రీ చెప్పింది.’ అంతేకాదు చాలా మంది ఇతర వినియోగదారులు దీనిపై వ్యాఖ్యానిస్తూ రకరకాలుగా తమ అభిప్రాయాన్ని తెలిపారు.

 

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..