Viral Pic: ఉద్యోగం ప్రయత్నాల్లో 300 సార్లు విఫలమయ్యాడు. ఎక్కడికి వెళ్లినా తిరస్కరణకు గురయ్యాడు. దాంతో ఆ వ్యక్తి వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. తన ఆలోచనను ఆచరణలో పెట్టాడు. నగరం అంతటా తన ఫోటోలతో హోర్డింగ్‌లు ఏర్పాటు చేశాడు. అవి చూసిన జనాలు ముక్కున వేలేసుకుని ఆశ్చర్యపోతుననారు.
ప్రపంచ దేశాల్లో నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరుగుతోంది. దాంతో ఉద్యోగం కోసం నిరుద్యోగులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. చాలామంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోతోంది. ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలోనే ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన ఓ గ్రాడ్యూయేట్ కూడా ఉద్యోగం కోసం తీవ్ర ప్రయత్నాలు చేశాడు. అతను తిరగని ఆఫీసు లేదు. ఎక్కని మెట్లు లేదు అన్నట్లుగా.. అన్ని ఆఫీసుల్లోనూ ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. దాదాపు 300 ఉద్యోగ ప్రయత్నాలు చేయగా.. అన్నింట్లోనూ తిరస్కరణకు గురయ్యాడు. అయితే, ఇక లాభం లేదని భావించన ఆ యువకుడు వినూత్న ఆలోచన చేశాడు.
ఆఫీసుల చుట్టూ తాను తిరగడమేంటని.. ఉద్యోగమే వెతుక్కుంటూ రావాలనే ఉద్దేశంతో సరికొత్త ప్రయోగానికి తెర లేపాడు. క్రిస్ హార్కిన్ అనే యువకుడు.. వారం రోజుల్లో 300 ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. అయితే, అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇక మళ్లీ మళ్లీ దరఖాస్తు చేయలేక.. ఆ యువకుడు ఉద్యోగం కోసం నగరం అంతటా హోర్డింగ్స్ ఏర్పాటు చేశాడు. ఇందుకోసం అతను 40 వేల రూపాయలు ఖర్చు చేశాడు. ఆ హోర్డింగ్‌లో తన ఫోటోతో సహా యాడ్ ఇచ్చిన క్రిస్.. ‘‘దయచేసి నన్ను నియమించుకోండి’’ అని రాశాడు. ఆ హోర్డింగ్‌లో క్రిస్ తన గురించి కొన్ని కీలక వివరాలనూ పేర్కొన్నాడు. స్టడీ వివరాలు, తన నైపుణ్యానికి సంబంధించిన వివరాలను కూడా అందులో పేర్కొన్నాడు.
దీని గురించి క్రిస్ మాట్లాడుతూ.. ‘2 సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ఎదరు చూస్తున్నా. 300 ప్రయత్నాల్లో విఫలమయ్యాను. దాంతో చాలా నిరాశ చెందాను. అప్పుడు నాకు బిల్‌బోర్డ్‌ను ఇన్‌స్టాల్ చేయాలనే ఆలోచన వచ్చింది. అతని సోదరితో మాట్లాడుతుండగా.. ఉద్యోగం పొందడానికి హోర్డింగ్‌లు పెట్టాలనే ఈ ఆలోచన తట్టిందట. అతని సోదరి సోషల్ మీడియా మేనేజర్. ప్రకటన ప్రచారం కోసం బిల్‌బోర్డ్‌లను ఇన్‌స్టాల్ చేసే పనిలో ఉన్నారు. క్రిస్ ఆలోచన ఖరీదైనది అయినప్పటికీ.. డిజైనింగ్ సహా చాలా పేపర్ వర్క్ చేయాల్సి వచ్చిందట. మొత్తానికి తన పని సునాయాసంగానే పూర్తయ్యిందని, ఇక ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నానని క్రిస్ పేర్కొన్నాడు.
Also read:
Hiring Trends: ఊపందుకున్న ఉద్యోగ నియామకాలు.. లింక్డ్‌ఇన్ ఇండియా సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి.
Silver Price Today: పెరుగుతున్న వెండి ధరలు.. హైదరాబాద్‌లో మాత్రం దిగి వచ్చింది.. ఎంతంటే..
Vijay Devarakonda: మళ్లీ షూరు కానున్న లైగర్.. బాక్సింగ్ రింగ్‌లోకి విజయ్ దేవరకొండ..