Mothers Love: సృష్టిలో అమ్మ ప్రేమకి సాటిఏదీ లేదు..మనుషుల్లోనే కాదు పశుపక్షాదుల్లో కూడా సృష్టిలో తియ్యనైంది మాతృత్వం అని పలు సంఘటనలు చూసినప్పుడు అనిపిస్తుంది. అందుకనే అమ్మ ప్రేమలోని కమ్మదనంకోసం అవతార పురుషుడు కూడా మానవజన్మ ఎత్తాడు అని అంటారు. తన బిడ్డ ఆకలి తీర్చడానికి అమ్మ ఎప్పుడూ ముందుంటుంది. తాను తినడం మానేసి మరీ బిడ్డ ఆకలితీర్చేది అమ్మ..తన పిల్లలను పెంచడంలో తల్లి జీవితంలో సగభాగం వెచ్చిస్తుంది. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఓ కోతి తన బిడ్డను అక్కున చేర్చుకుని తన చనుపాలు పట్టింది. ఆ సమయంలో తల్లికోతి ప్రేమ చూపరుల హృదయాలను కదిలిస్తుంది. తల్లిప్రేమను చూసి కొంతమంది భావోద్వేగానికి గురవుతున్నారు.
ఈ వీడియో ఉంది కొన్ని సెకన్లు మాత్రమే. అయితే ఏమిటి… ప్రజలను అమితంగా ఆకర్షించింది. మరి అంతగా నెటిజన్లను ఆకర్షించిన ఈ వీడియోలో ఏముందో తెలుసా.. తల్లీబిడ్డల ప్రేమ.. ఒక ఆడ కోతి తన బిడ్డకు పాలిస్తుంది.. ఈ సమయంలో, అమ్మ తన బిడ్డను మురిపెంగా చూస్తూ.. పాలు తాగుతున్నంత సేపు బిడ్డ నుదిటిపై ముద్దు పెట్టుకుంది. ఈ దృశ్యం చాలా అందంగా ఉంది.. చూసిన ఎవరైనా భావోద్వేగానికి లోనవుతారు. మళ్ళీ తమ అమ్మప్రేమని గుర్తు చేసుకుంటారు. ఈ వీడియో చూసిన వారికి జంతువులకు కూడా మనుషుల్లానే భావాలుంటాయని అనిపించకమానదు ఎవరికైనా..
Also Read: నేటి సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఎవరికైనా బాధాకరంగానే ఉంటుందన్న చాణక్య