Records: ‘ధూమపానం ఆరోగ్యానికి హానికరమంటూ’.. ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించున్నాడు. ఎలాగంటే..

|

Jan 14, 2023 | 9:13 AM

ధూమపానం ఆరోగ్యానికి హానికరమనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సిగరెట్‌, పొగాకు తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదం ఉంటుందని తెలిసినా కొందరు దానిని వదులుకోవడానికి ఇష్టపడరు. ఇక ధూమపానం ద్వారా జరిగే నష్టం గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు..

Records: ధూమపానం ఆరోగ్యానికి హానికరమంటూ.. ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించున్నాడు. ఎలాగంటే..
Follow us on

ధూమపానం ఆరోగ్యానికి హానికరమనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సిగరెట్‌, పొగాకు తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదం ఉంటుందని తెలిసినా కొందరు దానిని వదులుకోవడానికి ఇష్టపడరు. ఇక ధూమపానం ద్వారా జరిగే నష్టం గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతుంటాయి. సినిమాల మధ్య ప్రకటనలు, సిగరెట్‌ ప్యాకెట్లపై హెచ్చరిక గుర్తులు ముద్రిస్తూ ప్రజలను అలర్ట్‌ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా కర్ణాటకు చెందిన ఓ యువకుడు ధూమపానంపై వినూత్నంగా ప్రచారం చేసే ఏకంగా ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు.

కర్ణాటక రామనగర్‌లోని మట్టికెరె గ్రామాఇనకి చెందిన ఎం.ఎస్‌ దర్శన్‌ గౌడ అనే యువకుడు ధూమపానంపై ప్రజల్లో అవగాహన కల్పించాలనుకున్నాడు. అయితే అందరూ చెప్పిన విధంగా కాకుండా కాస్త విభిన్నంగా చెప్పాలనుకున్నాడు. ఇందులో భాగంగానే సిగరెట్‌పై ఏకంగా 260 సార్లు ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని రాశాడు. అంతటితో ఆగకుండా అదే సిగరెట్‌పై 80 సార్లు ఇండియా అని కూడా రాశాడు.

ఇలా కేవలం 6.9 సెంటీమీటర్లు ఉండే సిగరెట్‌పై 7,186 అక్షరాలు రాసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు దర్శన్‌. దీంతో గోల్డెన్‌బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో చోటు సంపాదించాడు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని చాటేందుకే ఇలా రాసినట్లు దర్శన్‌ గౌడ చెప్పాడు. దీంతో దర్శన్‌పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..