Video: వామ్మో.. ఎంత పే..ద్ద.. పామో.. చూస్తేనే గుండే ఆగేలా ఉంది.. అలా ఎలా పట్టేశావ్‌రా బుల్లోడా

King Cobra Viral Video: ఇలాంటి ప్రమాదకరమైన పాములను పట్టుకునేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన నిపుణులు మాత్రమే ప్రయత్నించాలి. ఎందుకంటే, ఒక చిన్న పొరపాటు కూడా ప్రాణాంతకం కావచ్చు.ఈ వీడియోలో ఆ యువకుడి ధైర్యం ప్రశంసనీయమే అయినా, ఇది అత్యంత ప్రమాదకరమైన పని.

Video: వామ్మో.. ఎంత పే..ద్ద.. పామో.. చూస్తేనే గుండే ఆగేలా ఉంది.. అలా ఎలా పట్టేశావ్‌రా బుల్లోడా
King Corba

Updated on: Jun 18, 2025 | 2:21 PM

Viral Video: ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత విషపూరితమైన పాములలో ఒకటైన కింగ్ కోబ్రాను (నాగుపాము) ఒక యువకుడు అత్యంత ధైర్యంగా పట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సీన్ చూసిన నెటిజన్లు ఆ యువకుడి ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు, కొంతమంది షాకవుతున్నారు.

కింగ్ కోబ్రా (Ophiophagus hannah) ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషపూరిత పాము. ఇది సాధారణంగా 10 నుంచి 13 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. కొన్నిసార్లు 18 అడుగుల వరకు కూడా ఉంటుంది. వీటి విషం అత్యంత ప్రమాదకరమైనది, ఒకే కాటుతో మనిషిని లేదా ఏనుగును కూడా చంపగలదు. ఇవి ఎక్కువగా ఆగ్నేయాసియాలోని అటవీ ప్రాంతాలలో కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోలో ఏం జరిగింది?

వైరల్ అవుతున్న వీడియోలో, ఒక యువకుడు పొడవైన కింగ్ కోబ్రాను పట్టుకోవడం చూడవచ్చు. పామును తన చేతులతో పట్టుకుని ధైర్యంగా నిలుచున్నాడు. అయితే, ఇది అడివిలో తీశారా, జూలాంటి ప్రదేశంలో తీశారా అనేది తెలియదు. ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు తీశారనే వివరాలు స్పష్టంగా లేవు.

ఓ యూజర్ నేచర్ ఈజ్ అమేజింగ్ జూన్ 15న తన @AMAZINGNATURE హ్యాండిల్ ద్వారా X ప్లాట్‌ఫామ్‌లో వీడియోను పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ ఇప్పటివరకు 22.4 మిలియన్ల వీక్షణలను సంపాదించింది. “ఇది కింగ్ కోబ్రా: ప్రపంచంలోనే అతిపెద్ద విషపూరిత పాము” అని క్యాఫ్షన్ అందించాడు.

ఇలాంటి ప్రమాదకరమైన పాములను పట్టుకునేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన నిపుణులు మాత్రమే ప్రయత్నించాలి. ఎందుకంటే, ఒక చిన్న పొరపాటు కూడా ప్రాణాంతకం కావచ్చు.ఈ వీడియోలో ఆ యువకుడి ధైర్యం ప్రశంసనీయమే అయినా, ఇది అత్యంత ప్రమాదకరమైన పని. స్వయంగా వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించడం ప్రాణాలకు ప్రమాదం కలిగించవచ్చు. ఈ వీడియో కింగ్ కోబ్రా ఎంత భయంకరమైన సృష్టో, దానిని నియంత్రించడం ఎంత కష్టమో మరోసారి గుర్తుచేస్తుంది.

అలాగే, నెటిజన్లు కూడా తమ కామెంట్లతో ఆ యువకుడి ధైర్యాన్ని ప్రసంసిస్తున్నారు. “కింగ్ కోబ్రాస్ పెద్దవి. ప్రమాదకరమైనవి, కానీ శిక్షణతో, వాటిని నిర్వహించడం సురక్షితం” అంటూ ఒకరు కామెంట్ చేయగా, “అతను చాలా ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు” అంటూ మరొకరు కామెంట్ చేశారు. “నువ్వు దాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు బ్రో” అంటూ ఒకరు కామెంట్ చేయగా, “నువ్వు ఎప్పుడైనా ఇలాంటి కింగ్ కోబ్రాను హ్యాండిల్ చేశావా??” అంటూ కామెంట్ చేశాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..