Viral Video: ఇంట్లోకి వచ్చిన నాగుపాము.. గృహిణి చేసిన పనికి ఫిదా అవుతోన్న నెటిజన్లు.

|

Sep 12, 2021 | 1:10 PM

Viral Video: పాము కనిపిస్తే మన వెన్నులో వణుకు పుడుతుంది. అది ఆమాడ దూరంలో ఉన్నా సరే భయపడి పరిగెడుతాం. అదే పాము ఇంట్లోకి వచ్చిందంటే ఇంకేమైనా ఉందా..! నానా హంగామా చేస్తాం...

Viral Video: ఇంట్లోకి వచ్చిన నాగుపాము.. గృహిణి చేసిన పనికి ఫిదా అవుతోన్న నెటిజన్లు.
Follow us on

Viral Video: పాము కనిపిస్తే మన వెన్నులో వణుకు పుడుతుంది. అది ఆమాడ దూరంలో ఉన్నా సరే భయపడి పరిగెడుతాం. అదే పాము ఇంట్లోకి వచ్చిందంటే ఇంకేమైనా ఉందా..! నానా హంగామా చేస్తాం. చుట్టు పక్కల వారందరినీ పిలిచి పామును చంపేదాక వదిలిపెట్టం. చేతిలో ఏది ఉంటే దానితో పామును చంపేస్తాం. అది విషపూరితమైనది కాదని, తెలిసినా.. ఆ పాము మనకు హాని కలిగించదని తెలిసినా? దానిని చంపేస్తాము. ఇక చిన్న చిన్న పాములు ఇంట్లోకి వస్తే ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది. ఒక్క దెబ్బతో పామును లేకుండా చేస్తాం. అయితే ఓ గృహిణి మాత్రం అలా చేయలేదు. ఇంట్లోకి వచ్చిన నాగుపామును ఎలాంటి భయం లేకుండా హ్యాండిల్ చేసింది.

వివరాల్లోకి వెళితే.. ఓ ఇంట్లోకి చిన్న నాగుపాము వచ్చింది. ఆ విషయాన్ని గమనించిన ఆ ఇంట్లోని గృహిణి వెంటనే ఓ చిన్న కర్రతో పామును నెమ్మదిగా గేటు నుంచి బయటకు పంపించేసింది. దీంతో పాము కూడా రిటర్న్‌ అటాక్‌ చేయకుండా అక్కడి నుంచి నెమ్మదిగా దగర్లోని చెట్ట పొదళ్లలోకి వెళ్లిపోయింది. అయితే పాము చిన్నదే అయినప్పటికీ పడగతీసిన తీరు చూస్తే భయంవేయక మానదు. కానీ ఎలాంటి భయం లేకుండా ఆ గృహిణి పామును బయటకు పంపించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. దీనంతటినీ అక్కడ ఉన్న కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను ప్రముఖ జంతు సంరక్షక ఎన్‌జీవో సంస్థ పీపుల్‌ ఫర్‌ క్యాటిల్‌ ఇన్‌ ఇండియా ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసింది. దీంతో ఇది చూసిన నెటిజన్లు ఆ మహిళపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: Sai Dharam Tej Accident: తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్న వాళ్లకు క్లారిటీ ఇచ్చిన నరేష్.. ఏమన్నారంటే

Hyderabad: తన కంటే 12ఏళ్ల చిన్నోడితో మహిళ అఫైర్.. ఫైనల్‌గా ఊహించని విషాదాంతం

India Post: సీనియర్‌ సిటిజన్స్‌కు గుడ్‌న్యూస్‌.. పోస్టాఫీసుకు వెళ్లకుండా కుటుంబ సభ్యులు ఈ పనులు చేయవచ్చు