Watch Video: బండిపై వెళ్తున్న దంపతులు.. బైక్‌ చక్రంలో ఇరుకున్న మహిళ చీర.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

|

Feb 03, 2024 | 5:33 PM

ఓ జంట బైక్‌పై వెళుతుండగా, మహిళ చీర పొర బైక్‌ చక్రంలో చిక్కుకుపోయింది. అదృష్టవశాత్తూ, మహిళ దీనిని గమనించి వెంటనే బైక్‌ ఆపమని కోరింది. మహిళ భర్త బైక్ చక్రంలో ఇరుక్కున్న చీరను తొలగించేందుకు ప్రయత్నించాడు. కానీ, అది రావడం లేదు..బైక్‌ చక్రంలో చీర కొంగు పూర్తిగా ఇరుక్కుపోవటంతో ఆమె నడిరోడ్డుపై ఇబ్బందిపడుతుంది.. అంతలోనే అక్కడే పనిచేసుకుంటున్న ఓ స్వీపర్ ఆ మహిళకు సహాయం చేయడానికి వచ్చాడు.

Watch Video: బండిపై వెళ్తున్న దంపతులు.. బైక్‌ చక్రంలో ఇరుకున్న మహిళ చీర.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Woman Saree Stuck In The Wheel
Follow us on

ప్రమాదాలు జరగకుండా బైక్ నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారులకు ట్రాఫిక్‌ సిబ్బంది ఎప్పటికప్పుడు సూచిస్తూనే ఉంటారు. ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంటారు. బైక్ నడిపే వారికే కాకుండా బైక్ వెనుక కూర్చున్న వారు కూడా అప్రమత్తంగా ఉండాలని చెబుతుంటారు. ముఖ్యంగా మహిళలకు అనేక సలహాలు, సూచనలు చేస్తుంటారు. బైక్‌ వెళ్తున్న సమయంలో మహిళలు తమ చీర, చున్నీలు వంటివి సర్దుకుని జాగ్రత్తగా కూర్చోవాలని చెబుతుంటారు.. చీర, చున్నీ బైక్ చక్రంలో చిక్కుకుని పలు మార్లు పెద్ద ప్రమాదానికి కారణమవుతుంది.. కాబట్టి, బైక్ నడుపుతున్నప్పుడు మహిళలు తమ వస్త్రాలను గమనించుకోవాలని చెబుతున్నారు. అయితే, తొందరపాటుగా, లేదంటే అజాగ్రత్త కారణంగా తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక మహిళ చీర పొర బైక్‌ వీల్‌లో ఇరుక్కుపోయింది. అయితే ఆ తర్వాత జరిగింది ఊహించనిది.

వైరల్‌ అవుతున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లోని gyanmarg06 అనే ఖాతాలో షేర్ చేయబడింది. ఓ జంట బైక్‌పై వెళుతుండగా, మహిళ చీర పొర బైక్‌ చక్రంలో చిక్కుకుపోయింది. అదృష్టవశాత్తూ, మహిళ దీనిని గమనించి వెంటనే బైక్‌ ఆపమని కోరింది. మహిళ భర్త బైక్ చక్రంలో ఇరుక్కున్న చీరను తొలగించేందుకు ప్రయత్నించాడు. కానీ, అది రావడం లేదు..బైక్‌ చక్రంలో చీర కొంగు పూర్తిగా ఇరుక్కుపోవటంతో ఆమె నడిరోడ్డుపై ఇబ్బందిపడుతుంది.. అంతలోనే అక్కడే పనిచేసుకుంటున్న ఓ స్వీపర్ ఆ మహిళకు సహాయం చేయడానికి వచ్చాడు. వెంటనే తన చొక్కా తీసి ఆ మహిళకు ఇచ్చాడు. ఆ తరువాత ఆమె భర్తకు సహాయం చేసాడు.. అలా ఇద్దరూ కలిసి బైక్‌లో ఇరుక్కున్న చీర కొంగును జాగ్రత్తగా బయటకు తీశారు. అనంతరం ఆమె ఆ స్వీపర్‌ చొక్కాను తిరిగి ఇచ్చేస్తూ అతనికి ధన్యవాదాలు తెలిపింది. ఆపద సమయంలో వచ్చి సాయం చేసిన అతనికి దంపతులిద్దరూ దండపెట్టి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పారిశుధ్య కార్మికుల మానవత్వాన్ని ప్రజలు అభినందిస్తున్నారు. ఆపదలో ఉన్న వ్యక్తులకు ఎలా సహాయం చేయాలో ఈ వీడియో చెబుతుంది. ఈ వీడియోపై కామెంట్స్ చేస్తూ ప్రజలు తమ స్పందనను వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..