
Mumbai Rains: కొన్ని సంఘటనలు చూస్తే కొద్దిసేపు గుండె ఆగినంత పని అవుతుంది. వెంట్రుకవాసిలో చావు తప్పించుకున్న వారిని గురించి అప్పుడప్పుడు వింటూ ఉంటాం. ఇప్పుడు సీసీ కెమెరాల పుణ్యమా అని తరచు అటువంటివి చూస్తున్నాం. ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో ఇటువంటి దృశ్యాలు మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. రెప్పపాటులో ప్రాణాలు రక్షింప బడటం మనం చూడటానికే మన పై ప్రాణాలు పైనే పోతాయి. అటువంటిది ఆ సంఘటనలో తప్పించుకున్న వారి మానసిక స్థితి ఎలా ఉంటుందో కదా అనిపిస్తుంది. తాజాగా సెకన్లో వెయ్యోవంతులో ఓ పెద్ద ప్రమాదం నుంచి బయట పడిన మహిళ వీడియో ట్రెండ్ అవుతోంది.
మహారాష్ట్రలోని ముంబయిలో ఈ ఘటన జరిగింది. తుఫాను కారణంగా ముంబై ను సోమవారం భారీ వర్షాలు.. వేగవంతమైన గాలులు ముంచెత్తాయి. ఈ సమయంలో ఒక మహిళ గొడుగుతో వీధిలో నడుస్తోంది.. అదే సమయంలో ఆమె పక్కనే ఒక పెద్ద చెట్టు అకస్మాత్తుగా విరిగి పడిపోయింది. సెకనులో వందోవంతు వేగంతో ఆ చెట్టు పడిపోతున్న సమయానికి ఆ మహిళ కొద్దిగా పక్కకు వెళ్ళింది. చాలా అదృష్టం ఆమె పక్షాన ఉందనిపిస్తుంది ఈ 8 సెకన్ల వీడియో చూస్తే. మీరూ వీడియో చూడండి కచ్చితంగా అదే అనిపిస్తుంది..
ఈ వీడియో సిసిటివి ఫుటేజ్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన తర్వాత 30 వేల వ్యూస్ సంపాదించింది. సోమవారం, మహారాష్ట్రలో తుఫాను ఆగ్రహంతో రాష్ట్రం వినాశనానికి గురైంది. భారీ వర్షాలు, గంటకు 100 కి.మీ.కు పైగా బలమైన గాలులతొ బీభత్సం జరిగింది. చెట్లు కూలిపోయాయి. 2,500 గృహాలకు నష్టం వాటిల్లింది. ట్రాఫిక్ మొత్తం అంతరాయం కలిగిండి. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దాదాపు 11 గంటలు మూసివేశారు. తక్టే తుఫాను కారణంగా ముంబైలో 230 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మేనెలలో ఇప్పటివరకూ ఇదే అత్యధికంగా 24 గంటల వర్షపాతంగా వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.
#WATCH | Mumbai: A woman had a narrow escape when she managed to move away from the spot just in time as a tree uprooted and fell there. (17.05.2021)
Mumbai received heavy rain and wind yesterday in wake of #CycloneTauktae
(Source: CCTV footage) pic.twitter.com/hsYidntG7F
— ANI (@ANI) May 18, 2021
Also Read: PM Modi Aerial Survey: వాయుగుండంగా మారిన తౌక్టే తుఫాన్.. గుజరాత్‌లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే
ఆ గ్రామాన్ని వణికిస్తున్న మాయరోగం, 27 రోజుల వ్యవధిలో 36 మంది మృతి.. కరోనా కాదట..!