Trending Video: ఇదేందయ్యా ఇది.. ఇలాంటి లిఫ్ట్ ను ఎక్కడా చూసుండరు.. కొంచెం పట్టు తప్పినా ఇక అంతే..

|

Jan 05, 2023 | 10:39 AM

లిఫ్ట్ లు ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఎత్తైన భవనాలు, మాల్స్ వంటి వాటిలో లిఫ్ట్స్ ఉంటాయి. మెట్లు ఎక్కిదిగాల్సిన ఇబ్బందిని ఇవి తీరుస్తున్నాయి. చాలా సౌకర్యవంతంగా ఉండటంతో వీటిని చాలా ఈజీగా ఉపయోగించుకోవచ్చు....

Trending Video: ఇదేందయ్యా ఇది.. ఇలాంటి లిఫ్ట్ ను ఎక్కడా చూసుండరు.. కొంచెం పట్టు తప్పినా ఇక అంతే..
Lift Video
Follow us on

లిఫ్ట్ లు ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఎత్తైన భవనాలు, మాల్స్ వంటి వాటిలో లిఫ్ట్స్ ఉంటాయి. మెట్లు ఎక్కిదిగాల్సిన ఇబ్బందిని ఇవి తీరుస్తున్నాయి. చాలా సౌకర్యవంతంగా ఉండటంతో వీటిని చాలా ఈజీగా ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా మెట్లు ఎక్కాల్సి వస్తే రెండు నుంచి మూడు.. మహా అయితే నాలుగు ఫ్లోర్లు ఎక్కగలుగుతాడు. కానీ అంతకంటే ఎక్కువ ఫ్లోర్లు ఎక్కాల్సిన అవసరం వస్తే.. కచ్చితంగా లిఫ్ట్ ఎక్కాల్సిందే. దీని ద్వారా ఎంతో ఎత్తైన భవనాలను కూడా చాలా ఈజీగా ఎక్కేయొచ్చు. లిఫ్ట్ కు తలుపులు, బటన్లు, ఫ్లోర్ నంబర్లు ఉంటాయి. బటన్ నొక్కిన తర్వాతే.. వాటి తలుపులు తెరుచుకుని లోపలకు వెళ్లేందుకు అనుమతి ఇస్తుంది. లోపలికి వెళ్లిన తర్వాత మనం వెళ్లాల్సిన ఫ్లోర్ ను సెలెక్ట్ చేసుకుంటే మనం కోరుకున్న చోటుకు తీసుకెళ్తుంది. అయితే.. ఇప్పుడు లిఫ్ట్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే ఆ లిఫ్ట్ కు డోర్లు లేవు మరి.

వైరల్ అవుతున్న వీడియోలో లిఫ్ట్ కు తలుపులు లేవు. అంతే కాకుండా ఆపే వ్యవస్థ లేదు. చాలా ప్రమాదకరంగా కనిపిస్తుంది. ఈ క్లిప్ లో ఓ వ్యక్తి లిఫ్ట్ ఎక్కేందుకు ప్రయత్నిస్తుంటాడు. అదే సమయంలో లిఫ్ట్ ఆగదు. దీంతో అతను లిఫ్ట్ ను ఆపి.. చాలా సాహసోపేతంగా లోపలికి వెళ్తాడు. ఈ లిఫ్ట్‌లో తలుపు లేదు. లిఫ్ట్ ఆగదు. ఇది కదులుతూనే ఉంది. అందులో ఎక్కడం లేదా దిగడం కష్టమైన పని కాదు, కానీ వృద్ధులు లేదా వికలాంగులకు ఇది కచ్చితంగా కష్టమవుతుంది. ఎందుకంటే ఎక్కేటప్పుడు పడిపోయే ప్రమాదం కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది. ఇప్పటివరకు ఈ వీడియోకు 1 లక్షా 20 వేల వ్యూస్, వందల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్లు రూపంలో రాస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి