Trending: 67 ఏళ్ల వయసులో అదరగొట్టిన బామ్మ.. రోప్‌ పై సైక్లింగ్‌ తో సవారీ.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..

|

Feb 16, 2023 | 8:22 AM

వయసు అనేది కేవలం నంబర్ మాత్రమే. కొందరు తమ వయసు అయిపోయిందని భావిస్తే.. మరికొందరు మాత్రం తాము చేయాలనుకున్న దానికి వయసుతో సంబంధం లేనట్లుగా ఉంటారు. తమలో దాగి ఉన్న ట్యాలెంట్ ను వృద్ధాప్యంలో బయటపెడుతుంటారు కొందరు. ఓల్డేజ్ లోనూ తమ డ్రీమ్ ను ఫుల్ ఫిల్ చేసుకుంటారు. బరువులు ఎత్తడం, రన్నింగ్ చేయడం, స్పోర్ట్స్ ఆడటం వంటివి మనం ఎన్నో చూశాం. ఇందుకు సంబంధించిన చాలా వీడియోలు ఇంటర్నెట్ లో ఉన్నాయి. వీటిలో కొన్ని బాగా […]

Trending: 67 ఏళ్ల వయసులో అదరగొట్టిన బామ్మ.. రోప్‌ పై సైక్లింగ్‌ తో సవారీ.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..
Old Woman Cycling
Follow us on

వయసు అనేది కేవలం నంబర్ మాత్రమే. కొందరు తమ వయసు అయిపోయిందని భావిస్తే.. మరికొందరు మాత్రం తాము చేయాలనుకున్న దానికి వయసుతో సంబంధం లేనట్లుగా ఉంటారు. తమలో దాగి ఉన్న ట్యాలెంట్ ను వృద్ధాప్యంలో బయటపెడుతుంటారు కొందరు. ఓల్డేజ్ లోనూ తమ డ్రీమ్ ను ఫుల్ ఫిల్ చేసుకుంటారు. బరువులు ఎత్తడం, రన్నింగ్ చేయడం, స్పోర్ట్స్ ఆడటం వంటివి మనం ఎన్నో చూశాం. ఇందుకు సంబంధించిన చాలా వీడియోలు ఇంటర్నెట్ లో ఉన్నాయి. వీటిలో కొన్ని బాగా నచ్చినవి అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ 67 ఏళ్ల బామ్మకు సంబంధించిన ఓ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

67 ఏళ్ల ఈ బామ్మ పెద్ద సాహసమే చేసింది. ఏకంగా రోప్‌ పైన సైకిల్‌ తొక్కుతూ అదికూడా చీర ధరించి అంత ఎత్తులో సైకిల్‌ తొక్కి ఔరా అనిపించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతూ అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. ఈ వీడియోను ఓ యూజర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఆరు పదుల వయసులో ఆమె కోరిక నెరవేరిందంటూ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను వేలాది మంది వీక్షిస్తూ లైక్‌ చేస్తున్నారు. ఆ వయసులో అంత ఎత్తులో బామ్మ ఎలాంటి బెరుకు లేకుండా సైకిలింగ్‌ చేయడం అద్భుతం అంటున్నారు. ఈ వీడియోకు ఫిదా అయిన నెటిజ‌న్లు బామ్మ ఉత్సాహం స్ఫూర్తిదాయ‌క‌ం అంటూ ప్రశంస‌లు కురిపించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..