ఇంటర్నెట్ వాడకం పెరిగినప్పటి నుంచి వెర్రి వేయి విధాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో పాపులారిటీ సాధించడం కోసం చిత్రవిచిత్రమైన పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని సార్లు ప్రమాదాల బారిన పడుతున్నారు. అంతే కాకుండా చుట్టుపక్కలా ఉన్నవారికీ ఇబ్బంది కలిగిస్తున్నారు. ఈ మధ్య ఇలాంటి విన్యాసాలకు మెట్రో రైలును వేదికగా చేసుకోవడం పరిపాటిగా మారింది. మెట్రో ట్రైన్‌లో ప్రయాణిస్తున్న సమయంలో రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ఆ మధ్య ఓ యువకుడు టవల్ చుట్టుకుని ఫోజు కొడుతూ వీడియో చేస్తే, మరో యువకుడు ఏకంగా మెట్రో ట్రైన్‌తోనే రేసింగ్ పెట్టుకున్నాడు. ఓ యువకుడు అయితే నాకు గర్ల్‌ఫ్రెండ్ కావాలంటూ మెడలో బోర్డు వేసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. తాజాగా ఓ యువతి ఢిల్లీ మెట్రో ట్రైన్‌లో చేసిన చేష్టలు నెటిజన్లు పిచ్చెక్కిస్తున్నాయి.
వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువతి ఖాళీగా ఉన్న మెట్రో రైలు బోగీలో తనకు వచ్చిన విద్యలన్నీ ప్రదర్శించింది. అంతేకాదు ఈ విన్యాసాలను ఓ వీడియోగా తీయించి ‘అపర్ణ దేవయాల్‘ పేరుతో ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. మెట్రోలో ప్రయాణికులు కింద పడిపోకుండా పట్టుకునేందుకు ఆధారంగా ఉండే హ్యాండ్ రెయిలర్లను చేత్తో పట్టుకుని అటూ, ఇటూ ఉయ్యాల మాదిరి ఊగిపోయింది. మధ్యలో యోగసనాలు వేసింది.
ఆ తర్వాత మెట్రోలో సీట్ పైకి ఎక్కి డ్యాన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేసింది. నెట్టంట వైరల్ అవుతున్న ఈ యువతి చేష్టలపై యూజర్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘అపర్ణా ఇలాంటివి చేయకు. దయచేసి అర్థం చేసుకో’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం