నేటి కాలంలో ప్రతి ఒక్కరూ తనను తాను ఫిట్‌గా ఉంచుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఇందు కోసం జిమ్‌లో గంటల తరబడి చెమటలు కక్కుతున్నారు. ఇవే కాకుండా తెల్లవారుజామున నిద్రలేచి మార్నింగ్ వాక్, యోగా చేసేవారు చాలా మందే ఉన్నారు. ప్రజలు ప్రతిరోజూ యోగా, వ్యాయామాన్ని జీవితంలో భాగం చేసుకున్నారు. అయితే.. మంచి ఆరోగ్యంపై మనుషులకు మాత్రమే కాకుండా జంతువులకూ అప్రమత్తత ఉంటుంది. దీనిని నిరూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిది. ఒక ఉడుత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా ఈ వీడియోను షేర్ చేశారు. ఇందులో ఒక ఉడత తన చేతులు, కాళ్ళను సాగదీయడం చూడవచ్చు. కరోనా కాలంలో ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరిగింది. ఈ మహమ్మారి ప్రభావం ఇప్పుడు జంతువులపై కూడా కనిపిస్తోంది. ఉడుతలు ఇలా వ్యాయామం చేయడం చూసి నెటిజన్లు చాలా ఇంప్రెస్ అవుతున్నారు.
Morning yoga.. ? pic.twitter.com/AqaD6WIZ4Z
ఇవి కూడా చదవండి— Buitengebieden (@buitengebieden) July 16, 2022
కొన్ని సెకన్ల ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఉడత ఇలా వ్యాయామం చేయడం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. వారి అభిప్రాయాలను కామెంట్లు గా ఇస్తున్నారు. ‘ఇప్పుడు జంతువులు, పక్షుల నుంచి మానవులు చాలా నేర్చుకోవాలి’, ‘ఉదయం ఆలస్యంగా నిద్రలేచే వారు, ఈ వీడియోను తప్పక చూడండి’ అని రాశారు. నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న వీడియోను మీరూ చూసేయండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం.