తల్లిని మించిన యోధురాలు ఈ భూమి మీద ఎవరూ లేరు.. ఇది ఈ మధ్య కాలంలో వచ్చిన ఓ సినిమాలోని డైలాగ్. వాస్తవానికి అమ్మను మించిన పోరాట యోధురాలు ఎవరుంటారు చెప్పండి. బిడ్డలను కంటికి రెప్పలా కాపుడుకునే తల్లి.. వారికి ఏమైనా కష్టం వస్తే తల్లడిల్లిపోతుంది. పిల్లలకు కీడు కలుగుతుందని భావిస్తే.. తన ప్రాణాలను అడ్డేసేందుకూ వెనకాడదు. అందుకే మాతృదేవోభవ అని అమ్మకు అగ్రస్థానం ఇచ్చారు. పిల్లలకు ఆపద వచ్చినప్పుడు ప్రమాదానికి ఎదురుగా కవచంలా నిలబడి పిల్లలను కాపాడుకున్న ఘటనలు మనం ఎన్నో చూశాం. ఆ ప్రమాదం ఎంత పెద్దదైనా.. తన ప్రాణాలను కోల్పోయినా.. బిడ్డలను రక్షించేందుకు వెనకడుగు వేయదు. మనుషుల్లోనే కాదు.. జంతువుల్లోనూ తల్లి ప్రేమ కనిపిస్తుంటుంది. ప్రస్తుతం ఓ తల్లీ కుమారుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో.. ఓ తల్లి తన బిడ్డను ప్రమాదం నుంచి బయటపడేసేందుకు తన ప్రాణాలనే పణంగా పెడుతుంది. ఒక మహిళ తన పిల్లవాడితో కలిసి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో ఓ కారు అదుపుతప్పి వేగంగా వారివైపు దూసుకొస్తుంది. దీన్ని గమనించిన ఆమె.. చిన్నారిని రక్షించేందుకు తల్లి కారుకు అడ్డంగా వెళ్తుంది. అయితే.. కారు అదుపుతప్పడంతో దాన్ని నియంత్రించడం డ్రైవర్ వల్ల కాలేదు. ఈ ఘటనలో కారు ఆమెను ఢీ కొడుతుంది. అయినా ఆ తల్లి తన బిడ్డ గురించే ఆలోచించి.. తన పిల్లవాడికి ఏమైందా అని లేచి వెళ్లడం విశేషం.
Mom tries to shield the baby from the impact… then another vehicle stops that car from getting away. pic.twitter.com/PAqmg1n3P8
— Dr. Ajayita (@DoctorAjayita) January 22, 2023
హృదయాలను హత్తుకుంటున్న ఈ వీడియో.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. కేవలం 24 సెకన్ల ఈ వీడియోను 5 లక్షల 91 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 5 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. వీడియోను చూసిన ప్రజలు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. తమ అభిప్రాయాలను కామెంట్లు రూపంలో రాస్తున్నారు.
మరిన్ని వైరల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..