Trending: ఈ కోతి గిన్నెలు కడిగితే తళతళ మెరవాల్సిందే.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఫన్నీ వీడియో..

|

Feb 18, 2023 | 9:58 AM

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇవాళ నెటిజన్లకు నచ్చిన విషయం రేపు నచ్చకపోవచ్చు. క్షణ కాలంలో ఏమైనా జరగొచ్చు. ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోతున్న కొద్దీ.. ప్రజల్లో..

Trending: ఈ కోతి గిన్నెలు కడిగితే తళతళ మెరవాల్సిందే.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఫన్నీ వీడియో..
Monkey Washing
Follow us on

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇవాళ నెటిజన్లకు నచ్చిన విషయం రేపు నచ్చకపోవచ్చు. క్షణ కాలంలో ఏమైనా జరగొచ్చు. ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోతున్న కొద్దీ.. ప్రజల్లో ఉన్న ట్యాలెంట్ బయటకు వస్తోంది. వారిలో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసుకువచ్చేందుకు సోషల్ మీడియా మంచి ప్లాట్ ఫామ్ గా ఉపయోగపడుతోంది. డ్యాన్సింగ్, సింగింగ్, కుకింగ్, ఫన్నీ స్కిట్స్.. ఇలా ఒక్కటేమిటి.. ఎన్నో కళలను వెలుగులోకి తీసుకువస్తున్నారు. రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. అయితే.. ఇంటర్నెట్ లో జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి. అవి చేసే డిఫరెంట్ పనుల వల్ల అవి నెటిజన్లను ఎక్కువగా ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కోతులు.. అంటే కుదురుగా ఉండవని భావిస్తుంటారు చాలా మంది. అంతే కాకుండా అవి చేసే అల్లరి కారణంగా.. చిన్నారులనూ కోతులతో పోలుస్తూ అల్లరి కోతి అని తిడుతుంటారు. కొన్ని కొన్ని సార్లు అవి ప్రజలను ఇబ్బంది కలిగిస్తుంటాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కోతి గిన్నెలు కడగడాన్ని చూడవచ్చు. అచ్చం మనుషుల మాదిరిగా పీచుతో తోమి.. శుభ్రం చేస్తోంది. వీడియో చూస్తుంటే కోతికి ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చారేమో అనిపిస్తుంది. అదే సమయంలో అక్కడికి ఓ మహిళ వచ్చి.. గిన్నెలు ఇస్తోంది. అయినా ఆ కోతి ఏ మాత్రం భయపడకుండా చకచకా గిన్నెలు తోమేస్తోంది.

ఇవి కూడా చదవండి

కోతి పాత్రలు కడుగుతున్న ఈ వీడియోను ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. వీడియోకు తక్కువ సంఖ్యలో ఎక్కువ లైక్స్, వ్యూస్ వచ్చాయి. అంతే కాకుండా వీడియో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను ఫన్నీగా కామెంట్లు రూపంలో రాస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..