Video Viral: ట్రెండ్ అవుతోన్న పాటకు అదిరిపోయే స్టెప్పులు.. ఈ పెద్దాయన డ్యాన్స్ చూస్తే ఈలలు వేయాల్సిందే..

సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటుంది. వీడియోలు గానీ, ఫొటోలు గానీ, ఫన్నీ టాస్కులు గానీ ఇలా అప్పటికప్పుడు సంచలనాలు సృష్టిస్తున్నాయి. అంతకు ముందు సుఖీభవ, నిన్నటి వరకు...

Video Viral: ట్రెండ్ అవుతోన్న పాటకు అదిరిపోయే స్టెప్పులు.. ఈ పెద్దాయన డ్యాన్స్ చూస్తే ఈలలు వేయాల్సిందే..
Wedding Dance

Updated on: Dec 22, 2022 | 3:23 PM

సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటుంది. వీడియోలు గానీ, ఫొటోలు గానీ, ఫన్నీ టాస్కులు గానీ ఇలా అప్పటికప్పుడు సంచలనాలు సృష్టిస్తున్నాయి. అంతకు ముందు సుఖీభవ, నిన్నటి వరకు బంగారం ఒకటి చెప్పనా.. ఇప్పుడు జంబలకిడి జారు మిఠాయా.. వంటివి వైరల్ అవుతున్న వీడియోలకు ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. అలాగే పాకిస్తానీ అమ్మాయి అయేషా చేసిన వీడియో వైరల్ అయినప్పటి నుంచి.. మేరా దిల్ యే పుకారే ఆజా పాట రీమిక్స్ వెర్షన్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. చాలా మంది ఈ పాటపై రీల్స్, వీడియోలు చేసి అప్ లోడ్ చేస్తున్నారు. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వీర విహారం చేస్తోంది. ఈ వీడియో లో ఓ వ్యక్తి వేస్తున్న డ్యాన్స్ మూమెంట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

వైరల్ అవుతున్న ఈ వీడియో పెళ్లి వేడుకలో చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. ‘మేరా దిల్ యే పుకారే ఆజా…’ పాటలో అయేషా వేసిన స్టెప్పులకు తగ్గట్టుగా ఓ వ్యక్తి డ్యాన్స్ చేయడం గమనించవచ్చు. అయితే ఆ వయసులోనూ ఇతను ఇంత అద్భుతమైన స్టెప్పులు వేయడాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ అయింది. ఈ వీడియోకు వేల సంఖ్యలో వ్యూస్ వస్తుండగా.. 6 వేల మందికి పైగా లైక్ చేశారు. అంతే కాకుండా వీడియో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..