Leopard Attack Video: అడవుల్లో ఉండాల్సిన వన్య మృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. అడవుల నరికివేత, ఆహారం లభ్యం కాకపోవడం వంటి కారణాలతో గ్రామాలు, నగరాల్లోకి వస్తున్నాయి. అంతే కాకుండా కనిపించిన వారిపై దాడి చేస్తున్నాయి. గాయపరుస్తున్నాయి. కొన్ని సార్లు ప్రాణాలు కూడా తీసేస్తున్నాయి. తాజాగా అసోంలోని జోర్హాట్ లో ఓ చిరుత కలకలం సృష్టించింది. కంచె దాటి జనావాసాల్లోకి వచ్చిన చిరుత స్థానికలును హడలెత్తించింది. రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నివాసితులపై దాడి చేసింది. ఈ దాడిలో 15 మంది గాయపడ్డారు. ఈ మేరకు జొర్హాట్ ఎస్పీ మోహన్ లాల్ మీనా వెల్లడించారు. వీరిలో మహిళలు, చిన్నారులు సహా ముగ్గురు అటవీ అధికారులు ఉండటం గమనార్హం. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు ఆస్పత్రికి తరలించామని. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా.. చిరుత పరుగెత్తుతున్న దృశ్యాలను అటవీ శాఖ సిబ్బంది వీడియో తీశారు.
ఈ వీడియోలో చిరుత.. క్యాంపస్ చుట్టూ తిరుగుతూ, ముళ్ల కంచెపై దూకడాన్ని చూడవచ్చు. జనాలపై మాత్రమే కాకుండా రోడ్డుపై వెళ్తున్న కారుపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జోర్హాట్ శివారులో ఉన్న అడవుల నుంచే చిరుతపులి క్యాంపస్‌లోకి వచ్చి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
#leopard inside campus of RFRI, #Jorhat #Assam pic.twitter.com/3bQzhWDJK2
— Ibrahim (@Ibrahimrfr) December 26, 2022
అయితే ఇప్పటి వరకు అధికారులకు చిరుత చిక్కకపోవడం అక్కడి వాసులను మరింత భయపెడుతోంది. చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిరుతను పట్టుకునేందుకు ఉచ్చులు బిగించిన అటవీశాఖ అధికారులు. దీంతో అక్కడ ఒక రకమైన వాతావారణం ఏర్పడింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..