హోమ్ వర్క్ తప్పించుకునేందుకు బుడ్డోడి ఫన్నీ రీజన్.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో

|

Sep 28, 2022 | 1:22 PM

స్కూల్ పేరు చెబితే చాలు.. పిల్లలు ఆమడ దూరం పరిగెడతారు. ఇక హోమ్ వర్క్ చేయమంటే మనకు దొరకను కూడా దొరకకుండా తప్పించుకుని తిరుగుతంటారు. వారికి మంచి, చెడు చెప్పి, బతిమాలి, హోమ్ వర్క్ చేయించడం...

హోమ్ వర్క్ తప్పించుకునేందుకు బుడ్డోడి ఫన్నీ రీజన్.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో
Student Home Work Video
Follow us on

స్కూల్ పేరు చెబితే చాలు.. పిల్లలు ఆమడ దూరం పరిగెడతారు. ఇక హోమ్ వర్క్ చేయమంటే మనకు దొరకను కూడా దొరకకుండా తప్పించుకుని తిరుగుతంటారు. వారికి మంచి, చెడు చెప్పి, బతిమాలి, హోమ్ వర్క్ చేయించడం తల్లులందరికీ కత్తిమీద సాము లాంటిది. వారు అడిగే ప్రశ్నలకు, పెట్టే చికాకులకు తల ప్రాణం తోకకు వచ్చేస్తుంది. అయితే కొందరు చిన్నారులు హోమ్ వర్క్ చేసేందుకు పడే తిప్పలు చూస్తే నవ్వు వస్తుంది. పనిని తప్పించుకోవడం కోసం వారు చెప్పే రీసన్స్ ఫన్నీగా అనిపిస్తాయి. ప్రతి ఒక్కరూ తమ బాల్యంలో హోమ్ వర్క్ నుంచి తప్పించుకునేందుకు ఏవేవో కారణాలు చెప్పే ఉంటారు. ఎందుకంటే ఆ జ్ఞాపకాలు మన జీవితంలో పదిలంగా భద్రమయ్యాయి. ఇక స్కూళ్లలో చిన్నారులతో టీచర్లు పడే ఇబ్బందులు అంతా ఇంతా కాదు. వారితో హోమ్ వర్క్ పూర్తి చేయించేందుకు నానా తంటాలు పడుతుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. వీటిని చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తుండటంతో అవి అప్పటికప్పుడు వైరల్ గా మారుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ క్లిప్ లో ఓ చిన్నారి తన తల్లిపై కోపంగా ఉన్నాడు. దానికి కారణమేంటంటే.. అతనిని హోమ్ వర్క్ చేయమని చెప్పడమే. చిన్నారి పెన్సిల్ తో పుస్తకం పై హోమ్ వర్క్ చేస్తుంటాడు. ఆ సమయంలో తన తల్లితో నా జీవితాంతం చదువుకుంటూ నేను ముసలివాడవుతాను. పిచ్చి మమ్మీ. అని ఏడుస్తూ చెప్తాడు. ఆమె మొబైల్ ఫోన్‌లో అతని రియాక్షన్స్ ను రికార్డ్ చేసింది. అప్పుడు ఆమె తన కుమారుడితో నీకు ఎందుకు వృద్ధాప్యం వస్తుంది..b c d రాయడంలో ముసలివాళ్లు అయిపోతారా అని ప్రశ్నిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది. అంతే కాకుండా ఈ వీడియో ఇంటర్నెట్ లో సంచలనం కలిగిస్తోంది. ఇప్పటి వరకు 5 లక్షల మందికి పైగా లైక్ చేశారు. అదే సమయంలో, వీడియోను చూస్తున్న వ్యక్తులు చాలా ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఓవరాల్‌గా ఈ వీడియోని ప్రజలు విపరీతంగా ఇష్టపడుతున్నారు.