AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: అదేంట్రా బుడ్డోడా అలా చేశావ్‌.. సైకిల్‌కు వేయాల్సిన తాళాన్ని తల్లి మెడకు వేశాడు.. చివరికి ఏమైందంటే..

Viral News: చిన్న పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని సందర్భాల్లో వాళ్లు తెలిసో తెలియకో చేసే పనులు తీవ్ర సమస్యలకు దారి తీస్తాయి. సన్నటి గోడ మధ్యకు వెళ్లి ఇరుక్కుపోవడం..

Viral News: అదేంట్రా బుడ్డోడా అలా చేశావ్‌.. సైకిల్‌కు వేయాల్సిన తాళాన్ని తల్లి మెడకు వేశాడు.. చివరికి ఏమైందంటే..
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 13, 2021 | 9:08 PM

Viral News: చిన్న పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని సందర్భాల్లో వాళ్లు తెలిసో తెలియకో చేసే పనులు తీవ్ర సమస్యలకు దారి తీస్తాయి. సన్నటి గోడ మధ్యకు వెళ్లి ఇరుక్కుపోవడం, బిందెలో తలపెట్టడం ఇలాంటి సంఘటనలు మనం చాలా చూసే ఉంటాయి. అయితే చిన్నారులు తాము చేసే పనులతో తమకే కాకుండా పక్కవారికి కూడా ఇబ్బందులు తెచ్చి పెడుతుంటారు. తాజాగా చైనాలో జరిగిన ఓ సంఘటనే దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పవచ్చు.

ఇంతకీ ఏమైందంటే.. చైనాలో ఓ నాలుగేళ్ల కుర్రాడికి పేరెంట్స్‌ ఇటీవల కొత్త సైకిల్‌ కొనిచ్చారు. అయితే ఆ సైకిల్‌కు రౌండ్‌ లాక్‌ ఉంది. సాధారణంగా కీ తో కాకుండా నెంబర్లతో అన్‌లాక్‌ చేసే విధానంతో ఉందా లాక్‌. అయితే ఆ కుర్రాడు సైకిల్‌ నుంచి ఆ లాక్‌ను బయటకు తీసి ఆడుకున్నాడు. ఈ క్రమంలో ఆడుతూ.. ఆడుతూ ఆ రౌండ్‌ లాక్‌ను తన తల్లి మెడకు వేసి లాక్‌ చేసేశాడు. అయితే వెంటనే స్పందించిన ఆమె లాక్‌ను తీయడానికి నెంబర్‌తో ప్రయత్నించింది. కానీ ఆ కుర్రాడు లాక్‌ను మార్చేశాడు. దీంతో ఒక్కసారిగా ఆందోళన చెందిన ఆమె.. స్థానికంగా ఉన్న పోలీస్‌ స్టేషన్‌కు చేరకుంది.

లాక్‌ను విప్పడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో కొందరు నిపుణులను పిలిపించి అత్యంత జాగ్రత్తగా కట్టర్‌ సహాయంతో లాక్‌ను కత్తిరించి లాక్‌ను తొలగించారు. లాక్‌ను తొలగిస్తున్న సమయంలో కొందరు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చూశారుగా ఏ మాత్రం అజాగ్రత్తతో ఉన్నా ఎంత పెద్ద ప్రమాదం జరిగే అవకాశముందో, కాబట్టి మీ చిన్నారులపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచండి సుమా.!

Also Read: Manmohan Singh: క్షీణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యం.. ఎయిమ్స్‌లో అత్యవసర చికిత్స అందిస్తున్న వైద్యులు

Manchu Vishnu: ‘MAA’ లో కొనసాగుతున్న చిటపటలు.. కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు ఏం చేయబోతున్నారు?

Bigg Boss 5 Telugu: సారీ చెప్పను.. ఏం చేసుకుంటావో చేసుకో.. పవన్‌ కళ్యాణ్‌ స్టైల్లో సిరికి కౌంటర్‌ ఇచ్చిన సన్నీ..

అధిక భద్రత.. మంచి రాబడి.. మహిళలకు ఈ పథకాలు బెస్ట్..!
అధిక భద్రత.. మంచి రాబడి.. మహిళలకు ఈ పథకాలు బెస్ట్..!
పాలు తేనెను కలిపి తీసుకోవడం మంచిదేనా?
పాలు తేనెను కలిపి తీసుకోవడం మంచిదేనా?
అక్షయ తృతీయ రోజున కుబేరుడిని ఈ దిశలో పెట్టండి భోగభాగ్యాలు మీసొంతం
అక్షయ తృతీయ రోజున కుబేరుడిని ఈ దిశలో పెట్టండి భోగభాగ్యాలు మీసొంతం
కెనడా ఎన్నికల్లో ఖలిస్తానీవాదులకు బిగ్ షాక్!
కెనడా ఎన్నికల్లో ఖలిస్తానీవాదులకు బిగ్ షాక్!
ఇంటర్, డిగ్రీ అర్హతతో ఏపీ CID నిఘా విభాగంలో ఉద్యోగాలు.. నో ఎగ్జాం
ఇంటర్, డిగ్రీ అర్హతతో ఏపీ CID నిఘా విభాగంలో ఉద్యోగాలు.. నో ఎగ్జాం
జియో యూజర్లకు బంపర్ ఆఫర్..తక్కువ ధరలో 200 రోజుల చెల్లుబాటు ప్లాన్
జియో యూజర్లకు బంపర్ ఆఫర్..తక్కువ ధరలో 200 రోజుల చెల్లుబాటు ప్లాన్
అక్షయ తృతీయ రోజున మీ ఫ్యామిలీ మెంబర్స్‏ను ఇలా సర్ ప్రైజ్ చేయండి..
అక్షయ తృతీయ రోజున మీ ఫ్యామిలీ మెంబర్స్‏ను ఇలా సర్ ప్రైజ్ చేయండి..
తెలంగాణలో బీర్లకు పెరిగిన డిమాండ్‌..రోజుకు ఎన్ని తాగుతున్నారంటే?
తెలంగాణలో బీర్లకు పెరిగిన డిమాండ్‌..రోజుకు ఎన్ని తాగుతున్నారంటే?
ట్రోలర్స్ కి ఇచ్చిపడేసిన ప్రీతి జింతా!
ట్రోలర్స్ కి ఇచ్చిపడేసిన ప్రీతి జింతా!
నల్ల యాలకులతో దిమ్మతిరిగే ఆరోగ్య ప్రయోజనాలు..? ఎన్నో రోగాలకు చెక్
నల్ల యాలకులతో దిమ్మతిరిగే ఆరోగ్య ప్రయోజనాలు..? ఎన్నో రోగాలకు చెక్