Viral Video: ఓ వైపు ఆశ్చర్యం.. మరోవైపు వెన్నులో వణుకు.. వైరల్‌ అవుతోన్న తిమింగళం వీడియో.

|

Jan 08, 2023 | 1:36 PM

ఓ వైపు ఆశ్చర్యం.. మరోవైపు భయపెట్టే దృశ్యం ఈ రెండు ఒకేసారి ఎదురైతే ఎలా ఉంటుంది.? అమెరికాలోని కాలిఫోర్నియాలో టూరిస్టులు ఇలా అనుభవాన్నే ఎదురుకున్నారు. తిమింగలాలను చూడడానికి సముద్రంలోకి వెళ్లిన పర్యాటకులకు..

Viral Video: ఓ వైపు ఆశ్చర్యం.. మరోవైపు వెన్నులో వణుకు.. వైరల్‌ అవుతోన్న తిమింగళం వీడియో.
Viral Video
Follow us on

ఓ వైపు ఆశ్చర్యం.. మరోవైపు భయపెట్టే దృశ్యం ఈ రెండు ఒకేసారి ఎదురైతే ఎలా ఉంటుంది.? అమెరికాలోని కాలిఫోర్నియాలో టూరిస్టులు ఇలా అనుభవాన్నే ఎదురుకున్నారు. తిమింగలాలను చూడడానికి సముద్రంలోకి వెళ్లిన పర్యాటకులకు ఊహించని పరిణామం ఎదురైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది.  కాలిఫోర్నియాలోని.. డానా పాయింట్‌లోని డానా స్ట్రాండ్స్‌ బీచ్‌లో సఫారీకి వచ్చిన పర్యాటకులను భారీ తిమింగలం ఒకటి దర్శనం ఇచ్చింది. కెప్టెన్‌ డేవ్‌ డాల్ఫిన్‌ అండ్ వేల్‌ వాచ్చింగ్‌ సఫారీకి తిమింగళాలను చూసేందుకు రోజూ వేల మంది పర్యాటకులు వస్తుంటారు. జనవరి 2న సఫారీకి వచ్చిన పర్యాటకులకు ఎప్పుడూ ఎవ్వరికీ కనిపించని అరుదైన దృశ్యం కనిపించింది.

బోటులో సముద్రంలోకి వెళ్లిన పర్యాటకులకు ఓ భారీ తిమింగలం బిగ్‌ షాకిచ్చింది. వారు ప్రయాణిస్తున్న బోటు కిందకు వెళ్లిన నానా హంగామా చేసింది. దాందో బోటులో ఉన్న పర్యాటకు ఏం జరుగుతుందోనని హడలెత్తిపోయారు. ఆ భారీ తిమింగలంతోపాటు ఓ పిల్ల తిమింగలం కూడా ఉంది. ఈ రెండూ బోటుకు సమీపంగా వచ్చి విన్యాసాలు చేశాయి. అయితే పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటంలా మారింది బోటులో ఉన్నవారి పరిస్థితి. అయితే ఆ తిమింగలాలు వారికి ఎలాంటి హానీ కలిగించలేదు. పైగా వాటి విన్యాసాలతో పర్యాటకులను ఎంతగానో అలరించాయి.

జనవరి 2న వెళ్లిన పర్యాటకులకు ఆ అరుదైన అవకాశం దక్కింది. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది. సాధారణంగా తిమింగళాలు శీతాకాలంలో వెచ్చదనం కోసం పసిఫిక్‌ మహా సముద్రం నుంచి అమెరికా తీరానికి వస్తుంటాయి. ఇలా వచ్చినప్పుడే జనవరి, ఫిబ్రవరి నెలల్లో అవి సంతానోత్పత్తి కూడా చేస్తాయి. అలా వెచ్చదనం కోసం కాలిఫోర్నియా తీరానికి వచ్చి బిడ్డను కన్న ఓ తిమింగళమే తాజాగా పర్యాటకుల కంటపడింది.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..