అంతరించిపోయిందని భావించిన అరుదైన రెండు చేతుల చేప 20 ఏళ్ల తర్వాత దొరికింది. రెక్కలకు బదులు చేతులతో ఉన్న ఈ వింత చేప ఆస్ట్రేలియాలోని టాస్మానియాలోని ప్రింరోస్ సాండ్స్ వద్ద బీచ్‌లో కనిపించింది. ప్రింరోస్ సాండ్స్ వద్ద బీచ్‌లో నడుచుకుంటూ వెళ్తున్న కెర్రీ యారే ఈ వింత చేపను గుర్తించారు. ఇది చివరిగా 20 సంవత్సరాల క్రితం కనిపించింది. ఈ ప్రత్యేకమైన చేపను చూసిన కెర్రీ యారే ఆశ్చర్యపోయారు.. చేప చూసిన వారి అనుభవాన్ని ఇలా వ్యాఖ్యానించారు.. “నేను గమనించే ప్రతి జీవి పట్ల నాకు ప్రత్యేక ఆసక్తి ఉంది. ఇది చిన్న పఫర్ ఫిష్, టోడ్ ఫిష్ లాగా కనిపించింది. ఈ రకమైన చేపలను నేను తరచుగా చూశాను. కానీ, మీరు ఈ చేపను నిశితంగా పరిశీలిస్తే, ఇసుక పొర కింద చిన్న చేతులు ఉన్నట్లు మీరు చూడవచ్చు. దీన్ని చూసిన తర్వాత ఇది ఖచ్చితంగా అద్భుతమైనదని మీరు కూడా చెబుతారు.
అంతరించిపోతున్న జాతులలో ఒకటి ఈ చేతులు కలిగిన చేప. ఇలాంటి చేపలు సముద్రపు అడుగుభాగంలో నడవడానికి తమ చేతులను ఉపయోగిస్తాయి. ఇటీవల గుర్తించిన ఈ చేప అంతరించిపోయిందని భావించారు. కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సిఎస్‌ఐఆర్‌ఓ)కి చెందిన కార్లీ డివైన్ మాట్లాడుతూ, మొత్తం ప్రపంచంలో ఈ రకమైన చేపలు కేవలం 2,000 మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పారు. అయితే ప్రింరోస్ సాండ్స్ వద్ద ఈ మచ్చల హ్యాండ్ ఫిష్ గత వారం గుర్తుపట్టక ముందే అంతరించిపోయిందని భావించారు. కానీ అది 2005 నుండి ఇక్కడే ఉండవచ్చని తాము భావిస్తున్నట్టుగా చెప్పారు.. కానీ, ఈ చేప తమకు ఎప్పుడు కనిపించలేదని చెప్పారు.
Spotted: a handfish! 👀
Last weekend, a runner found a critically endangered spotted handfish (Brachionichthys hirsutus) in Tasmania. Unfortunately the fish was dead, but it’s exciting evidence of life of a population we’d thought was locally extinct since 2005. pic.twitter.com/UzYHVZeTcO
— CSIRO (@CSIRO) September 10, 2023
CSIRO ప్రకారం, చుక్కల హ్యాండ్‌ఫిష్‌ని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ద్వారా అంతరించిపోతున్న చేప జాతిగా గుర్తించారు. ఈ తీరాల వెంబడి చేపలు పట్టడం, వేటాడటం కారణంగా అవి అంతరించిపోతున్నాయి. వాటి చిన్న, ఒంటరి స్వభావం కారణంగా ఈ చేతులతో చేపలు చాలా అరుదు. 1990ల ముందు, మచ్చల హ్యాండ్‌ఫిష్‌లు సులభంగా కనిపించేవి. కానీ ఇప్పుడు ఇవి చాలా అరుదు. సముద్రంలో డైవర్లు 60 నిమిషాల్లో ఒకటి లేదా రెండు చేపలను మాత్రమే గుర్తించగలరు. కొన్నిసార్లు అది కూడా ఉండదని సముద్రంలో ఈ చేపను చూసిన కెర్రీ యారే చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..