Viral Video: స్నేహమంటే ఇదేరా.. పిల్లిని కాపాడిన కుందేలు.. నెట్టింట వైరలవుతున్న వీడియో

ఏదైన కష్టం వచ్చినప్పుడు ఒకరికొకరు సహాయం మనుషులే కాదు.. జంతువులు కూడా సహాయం చేసుకుంటాయి. తాజాగా ఓ పిల్లిని కాపాడిన కుందెలు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీ అండ్ ఎస్ అనే ట్వి్ట్టర్ వినియోగదారుడు ఈ వీడియోని షేర్ చేశాడు. అయితే ఈ వీడియోను చూస్తే ఓ రేకుల షెడ్ కింద కుందేలు తన కాలితో మట్టిని తవ్వుతుంది.

Viral Video: స్నేహమంటే ఇదేరా..  పిల్లిని కాపాడిన కుందేలు..  నెట్టింట వైరలవుతున్న వీడియో
Rabbit

Updated on: May 14, 2023 | 1:36 PM

ఏదైన కష్టం వచ్చినప్పుడు ఒకరికొకరు సహాయం మనుషులే కాదు.. జంతువులు కూడా సహాయం చేసుకుంటాయి. తాజాగా ఓ పిల్లిని కాపాడిన కుందెలు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీ అండ్ ఎస్ అనే ట్విట్టర్ వినియోగదారుడు ఈ వీడియోని షేర్ చేశాడు. అయితే ఈ వీడియోను చూస్తే ఓ రేకుల షెడ్ కింద కుందేలు తన కాలితో మట్టిని తవ్వుతుంది. అలా తవ్వుతూ ఉండగా అందులో నుంచి పిల్లి బయటపడుతుంది. అయితే బయటకు వచ్చే దారి లేక లోపల చిక్కుకుపోయిన పిల్లిని కుందెలు కాపాడినట్లు పోస్టుకు క్యాప్షన్ ఇచ్చారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దాదాపు లక్ష 55 వేలకు పైగా వ్యాస్ వచ్చాయి. నెటిజన్లు తమ భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కుందేలు చేసిన సహాయానికి దాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కుందెల్ లిటిల్ జెంటిల్‌మెన్ అంటూ పొగుడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి..