AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: పవర్‌ ఫుల్‌ డ్యాన్స్‌తో అదరగొట్టిన పోలీస్‌ బాస్‌… వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

ప్రస్తుతం వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక పోలీసు అధికారిప్రైవేట్ ఈవెంట్‌ లో భాగంగా అదిరిపోయే డ్యాన్స్‌ చేస్తున్నాడు. కానీ, అతను సివిల్‌ డ్రెస్‌ లో ఉన్నాడు. వీడియో చూసిన తర్వాత ప్రతిఒక్కరూ షాక్‌తో నోరెళ్ల బెడుతున్నారు. అతని డ్యాన్స్ స్టెప్పులు చూస్తుంటే డ్యాన్స్‌లో బాగా నైపుణ్యం కలిగిన వ్యక్తిలా కనిపిస్తున్నాడు.

Watch Video: పవర్‌ ఫుల్‌ డ్యాన్స్‌తో అదరగొట్టిన పోలీస్‌ బాస్‌... వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!
Police Amazing Dance Video
Jyothi Gadda
|

Updated on: Apr 24, 2024 | 4:29 PM

Share

ఇంటర్‌ నెట్‌ పుణ్యమా అని అనేక వైరల్‌ వీడియోలను మనం సోషల్ మీడియాలో ప్రతి రోజూ చూస్తుంటాం.. అయితే, కొందరు వ్యక్తులు తమలోని ప్రతిభను చూపించేందుకు వేదికగా కూడా సోషల్ మీడియాలో మీడియాను ఉపయోగించుకుంటుంటారు. చాలా మంది సోషల్ మీడియాలో తమలోని టాలెంట్‌ను ప్రదర్శిస్తారు. కొందరు డ్యాన్స్ చేస్తూ కనిపిస్తే మరికొందరు పాటలు పాడుతూ కనిపిస్తారు. ప్రస్తుతం అలాంటి డ్యాన్స్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ పోలీసు అధికారి డ్యాన్స్ చేస్తూ కనిపించారు. వైరల్ వీడియోలో ఒక పోలీసు అధికారి ఒక ఈవెంట్‌లో ఎంతో హుషారుగా డ్యాన్స్‌ చేస్తూ అందరినీ అదరగొడుతున్నాడు. వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. సమాజంలో అత్యంత కీలకమైన విభాగం పోలీసులు. ప్రతి పౌరునికి భద్రత కల్పించేందుకు పోలీసులు 24 గంటలూ పనిచేస్తుంటారు. పోలీస్‌ ఉద్యోగం అంటే వారి కోసం, వారి కుటుంబంతో కలిసి సంతోషంగా గడిపేందుకు సమయం చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి ఒక పోలీస్‌ అధికారి డ్యాన్స్‌ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక పోలీసు అధికారిప్రైవేట్ ఈవెంట్‌ లో భాగంగా అదిరిపోయే డ్యాన్స్‌ చేస్తున్నాడు. కానీ, అతను సివిల్‌ డ్రెస్‌ లో ఉన్నాడు. వీడియో చూసిన తర్వాత ప్రతిఒక్కరూ షాక్‌తో నోరెళ్ల బెడుతున్నారు. అతని డ్యాన్స్ స్టెప్పులు చూస్తుంటే డ్యాన్స్‌లో బాగా నైపుణ్యం కలిగిన వ్యక్తిలా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ పోలీసు అధికారి పేరు సందీప్ శర్మ. అతని ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బయో ప్రకారం – అతను మధుర సబ్-ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి 1,33000 మంది ఫాలోవర్లు ఉన్నారు. సందీప్‌ శర్మ చాలా మంచి డాన్సర్. అతను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చాలా డ్యాన్స్ వీడియోలను తరచూ షేర్‌ చేస్తుంటాడు. ఆయన ప్రతి వీడియోకి జనాలు లైక్‌లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

View this post on Instagram

A post shared by SHIVAM MATHUR (@shiv_upcops)

ఈ వీడియో shiv_upcops, supercop_sharma ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల నుండి షేర్‌ చేయబడింది. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోకు ప్రతిస్పందించారు. ఒక వినియోగదారు ఇలా రాశాడు, పోలీసుల డ్యాన్స్ మొదటిసారి చూడటం ఆనందంగా ఉందని మరొక వినియోగదారు రాశాడు, సూపర్ డాన్సర్.. నేను మీ డాన్స్ చూసి మీకు అభిమానిగా మారానని అన్నారు. అని చాలా మంది వినియోగదారులు ఫన్నీగా స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..