సరదా కోసం అతడు చేసిన ఓ పని స్నేహితుడు ప్రాణాల మీదకు తెచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకపోయింది. చివరికి మృతుడు చనిపోయాడు. ఈ దారుణ ఘటన కేరళలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
అసోంకు చెందిన మింటూ, సిద్ధార్థ.. ఇద్దరూ కూడా పని కోసం కేరళకు వలస వచ్చారు. అయితే సరదాగా సిద్ధార్ధ.. మింటూ ప్రైవేటు పార్ట్‌లో కంప్రెసర్ పంప్ పెట్టి గాలి కొట్టాడు. దీంతో ఒక్కసారిగా మింటూ కడుపు ఉబ్బిపోయింది. వెంటనే సిద్ధార్థ అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండాపోయింది. అప్పటికే మింటూ చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. మింటూ చనిపోవడానికి గల కారణాన్ని సిద్ధార్ధ చెప్పగా.. వైద్యులకు అతడి మాటలు నమ్మశక్యంగా అనిపించలేదు. అలాగే మింటూ ముఖంపై గాయాలు కూడా ఉండటంతో.. అనుమానమొచ్చి పోలీసులకు సమాచారం అందించారు.
ఆ తర్వాత ఘటనాస్థలికి చేరుకొని పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా.. తాను సరదా కోసమే అలా చేశానని, కావాలని చంపలేదని సిద్ధార్ధ నిజాన్ని ఒప్పుకున్నాడు. సిద్దార్ధను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిపై ఇంతకముందు ఏవైనా కేసులు నమోదయ్యయా.? లేదా.? అని ఆరా తీస్తున్నారు. అలాగే మృతుడికి, నిందితుడికి మధ్య ఉన్న సంబంధాలపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మింటూ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు వైద్యులు.