కాకులకు పెరిగిన డిమాండ్… కరోనా కాలంలోనూ కాకులదే హావా… రెండు చేతుల భారీగా సంపాదిస్తున్న పెద్దాయన..

|

May 19, 2021 | 4:53 PM

కలికాలం ఇంటే ఇదేనేమో. పిండాలు తినే కాకులు కరువయ్యాయి. ఇంకేముంది, దీన్ని కూడా కొందరు ఉపాధిగా మార్చుకుంటున్నారు. ఢిల్లీలో ఓ పెద్దాయన

కాకులకు పెరిగిన డిమాండ్... కరోనా కాలంలోనూ కాకులదే హావా... రెండు చేతుల భారీగా సంపాదిస్తున్న పెద్దాయన..
Crow
Follow us on

కలికాలం ఇంటే ఇదేనేమో. పిండాలు తినే కాకులు కరువయ్యాయి. ఇంకేముంది, దీన్ని కూడా కొందరు ఉపాధిగా మార్చుకుంటున్నారు. ఢిల్లీలో ఓ పెద్దాయన కాకులు తీసుకొచ్చి పిండాలు తినిపిస్తూ పూటగడుపుకుంటున్నాడు. చనిపోయిన వారికి పిండాలు పెట్టేందుకు కొందరు కాకుల వద్ద ఏ విధంగా ఎగబడుతున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోతే మూడవ రోజు నుంచి పదకొండవ రోజు వరకు పక్షులకు పిండం పెట్టడం ఆనవాయితీ. తమ వారు మరణించిన తర్వాత కాకి రూపంలో కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తినడానికి వస్తారు అనే నమ్మకం పూర్వీకుల నాటి నుండే ఉంది. ఈ కారణంగానే ఎవరైనా పెద్దలు లేదా కుటుంబ సభ్యులు నప్పుడు పిండం పెట్టడం ఆచారం. కర్మకాండలలో భాగంగా కాకులకు ఆహారం పెడుతుంటారు. ఈ ఆనవాయితీ ఇప్పటికీ అనుసరిస్తున్నాు. ఇక కుటుంబసభ్యులు పెట్టిన ఆహారాన్ని కాకి తింటే తమ పెద్దలు సంతృప్తి చెందారనీ, ఒక వేళ కాకి ముట్టనట్లైతే వారి కోరిక ఏదో తీరకుండానే మిగిలిపోయిందని.. అందుకే వారు అసంతృప్తికి గురయ్యారని అనుకుంటూ ఉంటారు. ఆ కోరిక ఏదో తెలుసుకుని దానిని తీర్చడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అంతా కలియుగం….కాలం మారుతున్న కొద్ది ప్రస్తుతం పక్షి జాతి కూడా అంతరించిపోతుంది. మనం చేసిన తప్పిదాల వలన ఇప్పుడు జంతువులతోపాటు పక్షులు కూడా అంతరించిపోయాయి. ఇక రోజు ఉదయాన్నే ఇంటి ముందు అరిచే కాకులు కూడా కనుమరుగైపోతున్నాయి. పిండ ప్రదానం చేసేటప్పుడు కాకుల కోసం ఎదురుచూడాల్సిన అధ్వాన్న పరిస్థితిని చూడాల్సి వస్తుంది అయితే ఢిల్లీలో ఓ ఆసక్తికర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ పెద్దాయన రెండు కాకులు పట్టుకొని..పిండాలు తినిపిస్తూ దాన్ని ఉపాధిగా మార్చుకున్నాడు. ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

ఢిల్లీలో ఓ వద్ధుడు కాకులతో బిజినెస్ చేస్తున్నాడు. పిండం ముట్టుకునేందుకు కాకులు లేని ఈ కాలంలో రెండు కాకులతో ఆ పెద్దాయన రెండు చేతులా సంపాదిస్తున్నాడు. స్మశానాల వద్ద ఉండి.. అక్కడికి వచ్చిన ప్రజలకు కాకుల గురించి చెప్పి ఆ పిండాలను తన కాకులతో ముట్టించి డబ్బులు సంపాదిస్తున్నాడు. అలా తన కాకులకు కడుపు నింపడమే కాకుండా.. తాను ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాడు. ఈయనకు డిమాండ్ కూడా భారీగానే ఉందండోయ్. ఇక ఈ విషయాన్ని అందరికీ తెలిసేలా తాను చేసే పనిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేపిస్తున్నాడు ఈ పెద్దాయన. పిండప్రదానాలకు, సమారాధనలకు కాకి లభించును అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి మరీ ‘కాకులతో అడ్వాన్స్ బుక్కింగ్’లు చేసుకుంటు కాకులతో పిండాలను తినిపిస్తూ వ్యాపారం చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం కరోనా కాలంలో ఆ పెద్దాయనకు భారీగా బుకింగ్స్ వస్తున్నాయి. అంతేకాదు.. కాకుల కోసం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఇలా రోజు రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు సంపాదిస్తున్నాడు.

Also Read: PM Kisan: రైతులకు కేంద్రం గుడ్‏న్యూస్.. తక్కువ వడ్డీకే రుణాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే…

కరోనా కష్టాల్లో కేంద్రం గుడ్‏న్యూస్.. అకౌంట్లోకి ఉచితంగా రూ.50 వేలు.. సూపర్ ఛాన్స్.. ఇలా చేస్తే చాలు..