వధువరులు పెళ్లి జరుగుతోంది.. కోతి చేసిన పనికి అందరూ షాక్

|

Mar 23, 2023 | 7:14 AM

పెళ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలో మర్చిపోలేని ఘట్టం. కొన్ని పెళ్లిల్లు అర్థాంతరంగా ఆగిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి.

వధువరులు పెళ్లి జరుగుతోంది.. కోతి చేసిన పనికి అందరూ షాక్
Marriage
Image Credit source: TV9 Telugu
Follow us on

పెళ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలో మర్చిపోలేని ఘట్టం. కొన్ని పెళ్లిల్లు అర్థాంతరంగా ఆగిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. మరికొన్ని మన ఊహకు కూడా అందని విధంగా జరుగుతుంటాయి. అచ్చం అలాంటి ఘటనే ఓ పెళ్లి వేడుకలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..ఓ పెళ్లి వేడుకలో వధువరులు ఆనందంగా పెళ్లి చేసుకుటున్నారు. పెళ్లి కూడా అంగరంగ వైభవంగా నిరాటంకంగా జరుగుతోంది. బంధుమిత్రులతో మండపంలో సందడి వాతతావరణం నెలకొంది. అయితే సరిగ్గా ఆ వధువరులు తలంబ్రాలు వేసుకుంటూ ఉల్లాసంగా ఉన్న సమయంలో.. ఎక్కడి నుంచి వచ్చిందో ఓ కోతి నేరుగా మండంపంలోకి వచ్చేసింది. అంతే ఒక్కసారిగా అక్కడున్న పెళ్లి కొడుకు తలపై దాడి చేసి చేసి కొన్ని అక్షంతలు తీసుకుంది. దీన్ని చూసి వధువు ఆశ్చర్యపోయింది. క్షణాల్లోనే ఆమె నెత్తిపై దాడి చేసి ఆ కోతి వెళ్లిపోయింది. దీంతో అక్కడికి వచ్చిన వారందరూ ఒక్కసారిగా కంగుతిన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..