చిరుతతో సెల్ఫీ.. ఆ తర్వాత ఏమి జరిగిందంటే.?

|

Aug 19, 2019 | 7:46 PM

చిరుతపులితో ఆటలు ఆడాలంటే అంత ఈజీ కాదు.. ఒక్కసారి అది మన మీద ఎటాక్ చేసిందంటే పరుగు పెట్టాల్సిందే. సరిగ్గా ఇలాగే ఓ వ్యక్తి గాయపడిన చిరుతను ఫోటో తీయబోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. వెస్ట్ బెంగాల్‌లోని అలీప్రుడర్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డు ప్రక్కన గుంతలో ఓ పులి గాయాలతో పడిపోయి ఉండగా.. చుట్టుపక్కల వాళ్ళందరూ గుమ్ముగూడి ఆ పులినే తీక్షణంగా చూడసాగారు. ఇంతలో ఓ వ్యక్తి కొంచెం […]

చిరుతతో సెల్ఫీ.. ఆ తర్వాత ఏమి జరిగిందంటే.?
Follow us on

చిరుతపులితో ఆటలు ఆడాలంటే అంత ఈజీ కాదు.. ఒక్కసారి అది మన మీద ఎటాక్ చేసిందంటే పరుగు పెట్టాల్సిందే. సరిగ్గా ఇలాగే ఓ వ్యక్తి గాయపడిన చిరుతను ఫోటో తీయబోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. వెస్ట్ బెంగాల్‌లోని అలీప్రుడర్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రోడ్డు ప్రక్కన గుంతలో ఓ పులి గాయాలతో పడిపోయి ఉండగా.. చుట్టుపక్కల వాళ్ళందరూ గుమ్ముగూడి ఆ పులినే తీక్షణంగా చూడసాగారు. ఇంతలో ఓ వ్యక్తి కొంచెం ధైర్యం చేసి.. చిరుతను దగ్గర నుంచి ఫోటో తీసేందుకు ప్రయత్నించాడు. ఆ సదరు వ్యక్తి చేష్టలకు నొప్పితో బాధపడుతున్న పులికి చిర్రొత్తుకొచ్చింది. వెంటనే ఆ వ్యక్తిపై దాడి చేసింది. అందరి అరుపులకు భయపడిన పులి.. అతన్ని వదిలేసింది. అటు గాయం నొప్పి కూడా తీవ్రం కావడంతో మళ్ళీ కింద పడిపోయింది. స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో.. పులికి చికిత్స చేసి.. కోలుకున్న తర్వాత అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.