
మాంసప్రియుల్లో చాలామంది చేపలంటే ఎంతో ఇష్టంగా తింటారు. చేపల్లో రకరకాల చేపలుంటాయి. కొన్ని చేపల్లో ఎన్నో ఔషధగుణాలుంటాయి. చేపల్లో ఉండే ఒమేగా ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆహార నిపుణులు చెబుతుంటారు. ఇక మందుబాబుల గురించి అయితే చెప్పనక్కర్లేదు.. వీరు మందేస్తూ పక్కనే ఫిష్ ఫ్రైని స్టఫ్‌గా తింటూ ఎంజాయ్ చేస్తారు. అలాంటిది ఓ వ్యక్తి తను తాగే బీర్‌ను ఓ చేపకు తాగించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఆ వ్యక్తి తీరుపై మండిపడుతున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డియాండ్ చేస్తున్నారు.
ప్రజలు ఎంతో ఇష్టంగా తినే చేపల్లో రోహు చేప ఒకటి. ఇది పది కేజీలకుపైగా బరువు పెరుగుతుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఈ చేపకే ఆ వ్యక్తి బీరు తాగించాడు. ఓ పెద్ద రోహు చేపను ఓ చేతిలో పట్టుకుని, మరో చేతిలో బీరు సీసా ఎత్తి ఆ చేపకు తాగించాడు. అతను చేస్తున్న పనిని వారించాల్సింది పోయి అక్కడికి వచ్చిన మరో పెద్దమనిషి కూడా అతన్ని ఎంకరైజ్ చేశాడు. చేపకు బీరు తాగిస్తుంటే చూస్తూ ఎంజాయ్ చేశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో చూసిన నెటిజన్లు ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు. చేపకు బీరు తాగించం ఏంటంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణుల పట్ల ఎవరైనా హింసకు పాల్పడితే, వారిపై పోరాటాలు చేసే పెటా ఈ వీడియోపై దృష్టి సారించాలని, సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కొందరు మాత్రం ఈ ఘటనను సమర్థిస్తూ ఇది సరదాకోసం చేసిందిమాత్రమే..దీనిని సీరియస్‌గా తీసుకోకూడదంటూ వారిని సమర్ధించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి