Viral: పీహెచ్‌డీ చేశాడు… చివరికి కూరగాయలు అమ్ముకుంటున్నాడు..

పంజాబ్‌కు చెందిన 39 ఏళ్ల డాక్టర్ సందీప్ సింగ్ పంజాబ్‌ యూనివర్సిటీలో కాంట్రాక్టు ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. సందీప్‌ సింగ్‌ 11 ఏళ్లు యూనివర్సిటీలో న్యాయ విభాగంలో కాంట్రాక్టు ప్రొఫెసర్‌గా ఉన్నారు. అతను న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ చేశాడు. అలాగే పంజాబీ, జర్నలిజం, పొలిటికల్ సైన్స్‌తో నాలుగు మాస్టర్స్‌ డిగ్రీలను పూర్తి చేశాడు. అయితే అంతా బాగానే ఉందనుకున్న సమయంలో..

Viral: పీహెచ్‌డీ చేశాడు... చివరికి కూరగాయలు అమ్ముకుంటున్నాడు..
Phd

Updated on: Jan 01, 2024 | 12:21 PM

ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అనే సామెత వినేం ఉంటాం. కొంత మంది జీవితాలను చూస్తే ఇది నిజంగానే నిజమనిపిస్తుంది. అప్పటి వరకు బాగా బతికిన వారి జీవితాలు ఒక్కసారి తలకిందులవుతుంటాయి. పంజాబ్‌కు చెందిన సందీప్‌ సింగ్‌ది కూడా ఇలాంటి ఇతివృత్తమే. పీహెచ్‌డీ, 4 మాస్టర్స్‌ డిగ్రీలు చేసిన సందీప్‌ సింగ్‌ చివరికి రిక్షా మీద కూరగాయలు అమ్ముకునే దుస్థితి వచ్చింది. పీహెచ్‌డీ చేసిన వ్యక్తి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

పంజాబ్‌కు చెందిన 39 ఏళ్ల డాక్టర్ సందీప్ సింగ్ పంజాబ్‌ యూనివర్సిటీలో కాంట్రాక్టు ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. సందీప్‌ సింగ్‌ 11 ఏళ్లు యూనివర్సిటీలో న్యాయ విభాగంలో కాంట్రాక్టు ప్రొఫెసర్‌గా ఉన్నారు. అతను న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ చేశాడు. అలాగే పంజాబీ, జర్నలిజం, పొలిటికల్ సైన్స్‌తో నాలుగు మాస్టర్స్‌ డిగ్రీలను పూర్తి చేశాడు. అయితే అంతా బాగానే ఉందనుకున్న సమయంలో జీతంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. సమయానికి జీతం రాకపోవడం, జీతాల్లో జీతాల్లో కోత పెట్టడంతో ఇల్లు గడవడం ఇబ్బందిగా మారింది. దీంతో బతుకుదెరువు కోసం ఉద్యోగాన్ని మానేసి కూరగాయలు అమ్మడం ప్రారంభించాడు.

‘పీహెచ్‌డీ సబ్జీవాలా’ అనే బోర్డుతో కూరగాయలను విక్రయించడం ప్రారంభించాడు. దీంతో అతడిని ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం కాస్త తెగ వైరల్‌ అవుతోంది. అయితే తాను ప్రొఫెసర్‌గా సంపాదించిన దాని కంటే ఎక్కువగా కూరగాయలు అమ్మడం ద్వారా సంపాదిస్తున్నానని సందీప్‌ సింగ్ చెబుతున్నాడు. అయితే సందీప్‌ చదువుపై తనకున్న ఇష్టాన్ని మాత్రం వదల్లేదు. ఇప్పటికీ మరో డిగ్రీని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఉదయం కూరగాయలు అమ్మి, సాయంత్రం పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నాడు. ఇక టీచింగ్‌కు ప్రస్తుతం విరామం ఇచ్చినా.. కొంత డబ్బు ఆదా చేసుకున్న తర్వాత ఏదో ఒక రోజు సొంతంగా ట్యూషన్‌ సెంటర్‌ తెరుస్తానని చెబున్నాడు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..