Viral Video: ఆటోను ఎత్తి కుదేసిన దున్నపోతు.. దిగలేదు లేదు కాబట్టి డ్రైవర్ బతికిండు

|

Sep 12, 2022 | 1:53 PM

నడి రోడ్డుపై ఓ దున్నపోతు నానా రచ్చ చేసింది. ఆటోపై దాడి చేసింది. అందులోని డ్రైవర్ కిందకు దిగలేదు కాబట్టి ప్రాణాలతో బతికిపోయాడు.

Viral Video: ఆటోను ఎత్తి కుదేసిన దున్నపోతు.. దిగలేదు లేదు కాబట్టి డ్రైవర్ బతికిండు
Viral Video
Follow us on

Trending: మనిషికో మాట.. గోడ్డుకో దెబ్బ అన్నారు కదా అని… ఇలాంటి దున్నపోతులు ఎదురైనప్పుడు కర్ర పట్టుకుని ఎదురుగా నిల్చోకండి. అలా చేస్తే మీ బాడీ ప్యాకప్ అవుతుంది. అవును దున్నపోతు చాలా బలీయమైన పశువు. దాని కొమ్ములు కూడా చాలా పదునుగా ఉంటాయి. ఒక్కసారి కుమ్మింది అంటే.. ఫోటోకు దండ పడాల్సిందే. తాజాగా కేరళ(kerala)లోని పథనంతిట్టలో ఓ దున్నపోతు హైటెన్షన్ క్రియేట్ చేసింది. అంగమూజి-ప్లాపల్లి రోడ్డుపై నానా రచ్చ చేసింది. రోడ్డుపై వెళ్తున్న వాహనాలపై దాడి చేసింది. ఓ ఆటోను తన కొమ్ములతో ఎత్తి పడేసింది. ఈ ఘటనలో ఆటో స్వల్పంగా డ్యామేజ్ అయ్యింది. తర్వాత అదే ఆటోపై మరోసారి దాడి చేసేందుకు దూసుకుంటూ వచ్చింది. అదే సమయంలో ఆటోలోని డ్రైవర్‌గా సమస్పూర్తిగా వ్యహరించి.. వాహనాన్ని వెనక్కి పోనిచ్చాడు.  దీంతో ఆ దున్నపోతు అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయింది. ఈ ఘటనను ఆ ఆటో వెనకే ఉన్న మరో వాహనంలోని పాసింజర్స్ వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో తెగ సర్కులేట్ అవుతుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి