Marriage: పెళ్లి కోసం ఆ వరుడు అడిగిన వరకట్నం ఏమిటో తెలుసా? తెలిస్తే నువ్వు మామూలోడివి కాదు బ్రో అంటారు!

|

May 18, 2021 | 12:47 PM

Marriage: పెళ్ళంటే.. అబ్బో బాజాలు భజంత్రీలు..కళ్యాణమండపం..షామియానాలు..ఊరేగింపు..పట్టుచీరల ధగధగలూ..అటు వారు.. ఇటువీరు బంధువుల హడావుడీ..విందులు..వినోదాలు.. అబ్బబ్బా ఎన్ని చెప్పగలం లెండి.

Marriage: పెళ్లి కోసం ఆ వరుడు అడిగిన వరకట్నం ఏమిటో తెలుసా? తెలిస్తే నువ్వు మామూలోడివి కాదు బ్రో అంటారు!
Marriage
Follow us on

Marriage: పెళ్ళంటే.. అబ్బో బాజాలు భజంత్రీలు..కళ్యాణమండపం..షామియానాలు..ఊరేగింపు..పట్టుచీరల ధగధగలూ..అటు వారు.. ఇటువీరు బంధువుల హడావుడీ..విందులు..వినోదాలు.. అబ్బబ్బా ఎన్ని చెప్పగలం లెండి. పెళ్లి సందడి గురించి చెప్పాలంటే అసలు టైం చాలదు. అసలు ఏ శుభకార్యం అయినా ఆమాత్రం ఈ మాత్రం హడావుడి లేకపోతె ఏం బావుంటుంది చెప్పండి. కానీ, కరోనా కాలం ఒక దగ్గర నలుగురు కాదు కాదు ఇద్దరు చేరే పరిస్థితే లేదు. చేరినా.. మూతికి ముసుగులూ.. ఆ మాత్రం దూరంలో కూచుని మాట్లాడుకోవడం.. ఇదే కదా పరిస్థితి. ఒక విందు ఇచ్చేది లేదు.. ఎవరన్నా విందుకు పిలిస్తే వెళ్ళే ధైర్యం అంతకంటే లేదు. కానీ, పెళ్లి అంటే వధువు తరుపు.. వరుడు తరుపు ఎంతో కొంత హడావుడి లేకపోతె బాగోదు కదా. అందుకే నియమ నిబంధనలు అన్నీ పాటిస్తూ.. కొద్ది మంది సమక్షంలో అయినా హడావుడిగా చేసుకుందామనే అనుకుంటారు. సరే హడావుడి ఉన్నా లేకున్నా పెళ్ళికి పంతులు గారు వచ్చారంటే కనీసం గంట సేపైనా మంత్రాలూ..పూజలు చేయకుండా వదలరు. అంటే పెళ్ళంటే కనీసం గంట గంటన్నర తతంగం. అదీ మాకు వేగంగా కానీండి పంతులు గారూ అని మనం రిక్వస్ట్ చేస్తే. అబ్బా..ఈ పెళ్లిగోల ఏంటండీ బాబూ అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం.. ఒక వరుడు వరకట్నం కింద వధువు తరపువారిని ఏమడిగాడో తెలుసా? ఎంత తక్కువ సమయంలో పెళ్లి పూర్తి చేయగలరో అంత తక్కువ సమయంలో చేయాలి. ఇంకోటి గుడిలో.. అదీ బంధువులెవరూ రావడానికి వీల్లేదు. ఇది మన కోసమే కాదు మన బంధువులు అందరి క్షేమం కోసం అంటూ కోరాడు. మరి ఆ వరుడెవరో.. పెళ్లి ఎలా జరిగిందో తెలుసుకుందాం..

కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న తరుణంలో, దేశంలోని అనేక రాష్ట్రాల్లో అనేక ఆంక్షలు విధించారు. ఈ కారణంగా వివాహాలు తప్పనిసరి పరిస్థితిల్లో తక్కువ స్థాయిలోనే జరుగుతున్నాయి. ముఖ్యంగా, హిందూ వివాహాలు వివిధ ఆచారాలు వేడుకలతో సుదీర్ఘమైన ప్రక్రియ, అవి అమలు చేయడానికి గంటలు పడుతుంది. కానీ, ఉత్తర ప్రదేశ్ షాజహాన్పూర్లో జరిగిన ఒక ప్రత్యేకమైన వివాహంలో, కేవలం 17 నిమిషాల్లో ఆచారాలు ముగిశాయి. ఇది భారతదేశంలో చాలా అరుదుగా జరుగుతుంది! ఇది ఆ వరుడి కట్నం డిమాండ్ అంట. ఇది కచ్చితంగా మనకి నచ్చే విషయమే.

ఇక ఈ వివాహం పాట్నా దేవ్ కాళి ఆలయంలో జరిగింది, అందులో ‘బ్యాండ్ బాజా బారత్’ లేదా కారు కూడా లేవు. కోవిడ్ మధ్య సరళమైన వివాహం చేసుకోవటానికి, వరుడు వివాహ ఊరేగింపు చేయడానికి నిరాకరించాడు. అలాగే వరకట్నం తీసుకోవడానికి కూడా నిరాకరించాడు. గురువారం, వరుడు పుష్పేంద్ర దుబే మరియు వధువు ప్రీతి తివారీతో పాటు వారి కుటుంబ సభ్యులంతా ఏడు సార్లు ఆలయం చుట్టూ తిరిగారు. అంతే పెళ్లి అయిపొయింది. మొత్తం మీద వివాహం 17 నిమిషాల రికార్డు సమయంలో పూర్తయింది.

Also Read: Grand Mother: బామ్మగారు..బంతాట..అదరగొట్టేశారు సుమండీ! మీరూ చూస్తే..వారెవ్వా బామ్మా అంటారు గ్యారెంటీగా..Viral Video

SonuSood Foundation: సోనూసూద్ ఫౌండేష‌న్ పేరుతో న‌కిలీ విరాళాల సేక‌ర‌ణ‌.. ఫ్యాన్స్‌ను అల‌ర్ట్ చేసిన సోనూ…