Man Funny Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. అయితే.. కొన్ని వీడియోలు చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటాం. కొందరు ట్రెండ్ అవ్వాలని వీడియోలు చేస్తుంటారు. మరికొందరు తెలియకుండానే వైరల్ అవుతుంటారు. అయితే.. కొందరి అమాయకత్వమో.. తెలియనితనమో.. ముర్ఖత్వమో.. కానీ, వారు చేసే పనులు వాళ్లనే ప్రమాదంలో పడేస్తాయి. అలాంటి వాటికి సంబంధించిన వీడియోలు తరచూ నెట్టింట వైరల్ అవుతాయి. తాజాగా ఒక వ్యక్తి పరమానందయ్య శిష్యుడిలా ప్రవర్తించాడు. ప్రస్తుతానికి అతనికి సంబంధించిన ఫన్నీ వీడియో (Social Media) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసి నెటిజన్లు అందరూ తెగ నవ్వుకుంటున్నారు. మూర్ఖత్వానికి పరాకాష్ట అంటే ఇదేనంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి శిథిలావస్థలో ఉన్న గోడ మీదకు ఎక్కుతాడు. అనంతరం గోడను కాళ్లతో తంతూ ధ్వంసం చేయడం ప్రారంభిస్తాడు. ఆ వ్యక్తి ఇటుకలను కింద పడగొట్టేందుకు తన్నడాన్ని మనం వీడియోలో చూడవచ్చు. ఇటుకలను గట్టిగా తన్నడంతో గోడ ఒక్కసారిగా కూలిపోతుంది. దీంతో అతను నిల్చున్న సపోర్ట్ గోడ కూడా కూలి.. అతను కిందపడిపోతాడు. అయితే.. అతను పడిపోయిన విధానం చూస్తుంటే.. ఖచ్చితంగా గాయపడినట్లు అర్ధమవుతుంది. ఎందుకంటే ఇటుకలు అన్నీ అతనిపైనే పడ్డాయి. ఈ ఫన్నీ వీడియోను చూసి.. తెలివితక్కువ వ్యక్తులు ఇలానే చేస్తుంటారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
వైరల్ వీడియో..
ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో shukr.tv అనే యూజర్ షేర్ చేశారు. దీనిని ఇప్పటివరకు 4 లక్షల 15 వేలకు పైగా వీక్షణలు రాగా.. 7 వేల మందికి పైగా లైక్ చేశారు. అదే సమయంలో వీడియో చూసిన తర్వాత నెటిజన్లు పలు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడూ చేయవద్దంటూ సూచిస్తున్నారు.
Also Read: