ఆస్పత్రికి వచ్చిన రోగిపై చేయి చేసుకున్న లేడీ డాక్టర్.. కారణం ఏంటంటే..

ఈ గొడవ సమయంలో ఒక సెక్యూరిటీ గార్డు అడ్డుపడి ఆమెను వారించే ప్రయత్నం చేశాడు. కానీ, సదరు లేడీ డాక్టర్‌ మాత్రం ఆగలేదు. చివరకు వృద్ధుడు క్షమాపణ చెప్పినా ఆమె ఆగలేదు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆస్పత్రికి వచ్చిన రోగిపై చేయి చేసుకున్న లేడీ డాక్టర్.. కారణం ఏంటంటే..
lady doctor brutally beats elderly man

Updated on: Oct 12, 2025 | 10:22 AM

రాజస్థాన్‌ అజ్మీర్‌లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. అజ్మీర్‌లోని జవహార్ లాల్ నెహ్రూ హాస్పిటల్‌లో 92ఏళ్ల వృద్ధుడిపై ఓ మహిళా డాక్టర్ చేయి చేసుకుంది. అక్టోబర్ 10న ఈ ఘటన జరిగగా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం రెసిడెంట్ డాక్టర్ తన ఫ్రెండ్‌తో కలిసి కారిడార్‌లో నడుస్తుండగా.. వృద్ధుడు ఆమెను తాకాడు. దీంతో ఆవేశంలో అతన్ని కొట్టింది.

ప్రభుత్వ జవహర్‌లాల్ నెహ్రూ ఆసుపత్రి OPDలో ఒక వృద్ధుడు ఎదురుగా వస్తున్న ఒక మహిళా రెసిడెంట్ డాక్టర్‌ భుజాన్ని ఢీకొట్టడం వీడియోలో కనిపిస్తుంది..దాంతో రెసిడెంట్ డాక్టర్‌ కోపంతో ఆ వృద్ధుడిని కొట్టింది. ఈ గొడవ సమయంలో ఒక సెక్యూరిటీ గార్డు అడ్డుపడి ఆమెను వారించే ప్రయత్నం చేశాడు. కానీ, సదరు లేడీ డాక్టర్‌ మాత్రం ఆగలేదు. చివరకు వృద్ధుడు క్షమాపణ చెప్పినా ఆమె ఆగలేదు. అయితే ఆ వృద్ధుడు డాక్టర్ చెస్ట్‌ను తాకడంతోనే ఆమె చేయి చేసుకుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, సీసీటీవీ ఫుటేజీలో వైద్యుడిని గుర్తించడం కష్టంగా మారింది.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

ఈ సంఘటన గురించి తెలుసుకున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరవింద్ ఖరే, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ అమిత్ యాదవ్ కంట్రోల్ రూమ్‌లోని సీసీటీవీ కెమెరాలను చెక్‌ చేశారు. ఈ విషయంలో ఇంకా ఎవరూ ఫిర్యాదు చేయలేదని వారు చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..