Viral News: ఉద్యోగం మారాలానుకునే ముందు జీతంలో పాటు పలు అంశాలను పరిగణలోకి తీసుకుంటాం. వీటిలో ముఖ్యంగా పనివేళలు, వీకాఫ్స్, పని చేసే ప్రదేశం, మెడికల్ ఇన్సూరెన్స్ వంటి వాటిని చూసుకొని సదరు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలా.? లేదా అని నిర్ణయం తీసుకుంటాం. ఇది సర్వ సాధారణమైన విషయం. ఏ రంగంలో అయినా ఉద్యోగార్థుల ఆలోచనలు ఇలాగే ఉంటాయి. సంస్థలు కూడా ఉద్యోగులను ఆకర్షించేందుకు జీతంతో పాటు రకరకాల బెనిఫిట్స్ అందిస్తుంటాయి. పని చేయించుకునే ఉద్యోగుల మేలు కోసం ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఈ వివరాలను తెలుపుతూ జాబ్ పోర్టల్స్‌లో ప్రకటనలు ఇస్తుంటారు.
అయితే తాజాగా బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ పోస్ట్ చేసిన ప్రకటన నవ్వు తెప్పిస్తోంది. తమ కంపెనీలో ఉద్యోగం చేసే వారికి అందిస్తోన్న రకరకాల బెనిఫిట్స్‌ను తెలుపుతూ.. అందులో ‘బెంగళూరు వాతావరణం’ కూడా జోడించింది. కంపెనీ అందించే ప్రోత్సాహకాల్లో వాతావరణం కూడా ఉండడానికి గమనించిన ఓ నెటిజన్ స్క్రీన్ షాట్ తీసి ఆ ఫొటోను ట్వీట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కంపెనీ పేర్కొన్న అంశంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఓ యూజర్ స్పందిస్తూ.. అవును ఢిల్లీ, ముంబయితో పోలిస్తే ఇది నిజంగానే పెద్ద ప్రోత్సాహం అంటే, మరికొందరు మాత్రం వ్యతిరేకంగా పోస్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడీ అంశం వైరల్‌గా మారింది.
Just stumbled upon this while browsing jobs on LinkedIn ?@peakbengaluru ‘s weather is officially a perk now :p pic.twitter.com/Lc9cJtPkzr
— Sweta Singh (@swetaks) July 27, 2022
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..